Home

»

Latest News

ఆద్యను స్టేజ్‌పైకి పిలవొద్దన్న రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ కూతురి విషయంలో ఎందుకలా చేశారు.?

Nov 17, 2026 12:08PM

సినిమా ఈవెంట్లలో అప్పుడప్పుడు జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ధనుష్ నటించిన ‘ఓం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అలాంటి ఆసక్తికరమైన ఘటనే చోటుచేసుకుంది. ఈ వేడుకకు తన కుమార్తె ఆద్యతో కలిసి హాజరైన రేణు దేశాయ్.. యాంకర్ ఆమెను స్టేజ్‌పైకి ఆహ్వానించబోతుంటే వెంటనే వద్దంటూ వారించారు. దీంతో అసలు రేణు అలా ఎందుకు చేశారు? ఆద్యను స్టేజ్‌పైకి రానివ్వకపోవడానికి కారణమేంటి? అనే చర్చ మొదలైంది.

నవంబర్ 16న హైదరాబాద్‌లో ‘ఓం’ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీలతో పాటు చిత్రబృందం హాజరైంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రేణు దేశాయ్ కూడా తన కుమార్తె ఆద్యతో కలిసి ఈ వేడుకకు వచ్చారు.

ఈ క్రమంలో ప్రేక్షకుల మధ్య కూర్చున్న ఆద్యను గమనించిన యాంకర్.. ఆమెను స్టేజ్‌పైకి పిలుద్దామని మైక్‌లో ప్రకటించారు. అయితే రేణు దేశాయ్ వెంటనే స్పందిస్తూ ఆద్య స్టేజ్‌పైకి రావాల్సిన అవసరం లేదని సూచించారు. అటు ఆద్య కూడా స్టేజ్‌పైకి రావడానికి ఇష్టపడనట్లు తల అడ్డంగా ఊపారు. ఈ చిన్న సంఘటన అక్కడున్నవారి దృష్టిని ఆకర్షించింది.

అయితే రేణు దేశాయ్ ఆద్యను స్టేజ్‌పైకి రానివ్వడానికి నిరాకరించడానికి అసలు కారణం ఏమిటనేది ఆమె స్వయంగా వెల్లడించలేదు. ఆద్య కూడా స్టేజ్‌పైకి రావడానికి ఆసక్తి చూపించకపోవడంతో రేణు ఆమె ఇష్టాన్ని గౌరవించి ఉండొచ్చని భావిస్తున్నారు. 

నిజానికి రేణు దేశాయ్ తమ పిల్లలను స్టార్ కిడ్స్ లా కాకుండా సాధారణ పిల్లల్లాగే పెంచినట్లు గతంలోనే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సినీ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి వారు సినిమాల్లోకి రావాలని లేదు.. వారికి నచ్చిన ఫీల్డ్ లో ఎంకరేజ్ చేస్తానని చెప్పారు. తమ పిల్లలపై అనవసరమైన ఫోకస్ ఉండకూడదనే ఉద్దేశంతోనే రేణు దేశాయ్ ఈవెంట్ లో అలా చేశారు అనిపిస్తోంది. ఆద్య సైతం 'అసలు స్టేజ్‌పైకి నేను ఎందుకు?' అన్నట్టుగా రియాక్షన్ ఇవ్వడం విశేషం.

ఇది కూడా చదవండి: శ్రీలీల ఓపెన్ కామెంట్స్.. చిన్న వయసులో తప్పులు చేశా.!

 

 

 

[OM Pre Release Event, Renu Desai, Aadhya Konidela, Pawan Kalyan]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com