
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అభిమానుల్లో ఆసక్తి నెలకొంటుంది. ముఖ్యంగా ఆయన సినిమాలు, పాత జ్ఞాపకాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. తాజాగా నటి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఒకప్పుడు ఆయన సినిమాల కోసం తాను లండన్, మిలాన్ వరకు వెళ్లి ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ కొనుగోలు చేసేదాన్నని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి 'బద్రి', 'జానీ' వంటి సినిమాల్లో నటించారు. అలాగే పవన్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా రేణు దేశాయ్ వ్యవహరించారు. వాటిలో ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు వంటి సినిమాలు ఉన్నాయి.
ఖుషి, జానీ వంటి సినిమాల సమయంలో పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ కోసం తాను లండన్‌లో షాపింగ్ చేసేదాన్నని రేణు దేశాయ్ తెలిపారు. అక్కడ ఒక ప్రత్యేకమైన షాపింగ్ మాల్ ఉండేదని, పవన్ కోసం ఎక్కువగా అక్కడే దుస్తులు కొనుగోలు చేసేదాన్నని చెప్పారు. అయితే అక్కడ ఆమె తరచూ మరో సెలబ్రిటీ కూడా ఎదురయ్యేవారట. ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.
తాను పవన్ కళ్యాణ్ కోసం దుస్తులు కొనడానికి వెళ్తే.. కరణ్ మాత్రం షారుఖ్ ఖాన్ కోసం కాస్ట్యూమ్స్ కొనడానికి అక్కడికి వచ్చేవారని రేణు దేశాయ్ వెల్లడించారు. ఆయన షారుఖ్ ఖాన్‌కు స్టైలిస్ట్ కాకపోయినా.. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రత్యేకంగా దుస్తులు కొనుగోలు చేసేవారట. ఇలా ఒకే షాపింగ్ మాల్లో పవన్, షారుఖ్ ఖాన్ కోసం ఇద్దరు ప్రముఖులు కాస్ట్యూమ్స్ కొనడం ఆసక్తికరమైన విషయం.

ఇక పవన్ కళ్యాణ్ నటించిన 'బాలు' సినిమాలో ఆయన ధరించిన ఓ ప్యాంట్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. ఆ ప్యాంట్ కోసం ప్రత్యేకంగా మిలాన్ వెళ్లినట్లు రేణు దేశాయ్ తెలిపారు. అక్కడి షాపుల్లో వెతుకుతుండగా ఓ షాప్‌లో వరల్డ్ వార్-2 సమయంలో ఉపయోగించిన ఒరిజినల్ క్లాత్‌తో తయారుచేసిన ప్యాంట్ కనిపించిందట. అప్పట్లోనే దాని ధర రూ.75 వేలు కాగా.. మొత్తం ఐదు ప్యాంట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయట. వాటిలో ఒకదాన్ని పవన్ కళ్యాణ్ కోసం కొనుగోలు చేసినట్లు రేణు గుర్తుచేసుకున్నారు.
అంతేకాదు, పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన 'జానీ' సినిమా గురించి కూడా రేణు దేశాయ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మొదట తాను ఆ సినిమాలో హీరోయిన్గా నటించాల్సింది కాదని చెప్పారు. హీరోయిన్ ఎంపిక కోసం ముంబై వెళ్లి చాలామందిని పరిశీలించినప్పటికీ పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్‌లకు ఎవరూ నచ్చలేదట. చివరకు షూటింగ్ ప్రారంభానికి వారం రోజుల ముందు తననే హీరోయిన్గా నటించమని అడిగారని, పాత్ర నచ్చడంతో అంగీకరించినట్లు తెలిపారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ పాత సినిమాల వెనుక రేణు దేశాయ్ చేసిన కాస్ట్యూమ్ వర్క్, అప్పటి అనుభవాలు ఇప్పుడు మరోసారి ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా 'బాలు' సినిమాలోని ప్యాంట్ కోసం రూ.75 వేలు ఖర్చు పెట్టడం, లండన్‌లో కరణ్ జోహార్‌ను కలిసిన విషయాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ‘దాదా’ ఫస్ట్ సింగిల్.. బాలయ్య ఫ్యాన్స్ కోసం తమన్ అదిరిపోయే ట్రీట్.!
[Renu Desai About Pawan Kalyan, Renu Desai Interview, Pawan Kalyan Costumes, Pawan Kalyan Balu Pant, Kushi Movie, Johnny Movie, Pawan Kalyan, Renu Desai, Karan Johar, Shah Rukh Khan]






