Home

»

Latest News

‘దాదా’ ఫస్ట్ సింగిల్: బాలయ్య ఫ్యాన్స్ కోసం తమన్ అదిరిపోయే ట్రీట్.!

Nov 4, 2026 10:15AM

నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'దాదా'. 'వీరసింహారెడ్డి' తర్వాత బాలయ్య, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పుడు ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

'దాదా' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను దీపావళి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నవంబర్ 8న దీపావళి పండుగ సందర్భంగా బాలయ్య అభిమానులకు ఫస్ట్ సింగిల్‌తో సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావిస్తున్నారట.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ, తమన్ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'డాకు మహారాజ్' సినిమాల పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా థమన్ ఇచ్చే మ్యూజిక్ థియేటర్లలో మంచి హైప్ క్రియేట్ చేస్తుంటుంది. దీంతో 'దాదా' ఆల్బమ్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గోపీచంద్ మలినేని ఈసారి బాలకృష్ణను పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో చూపించబోతున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల కానుంది.

ఇది కూడా చదవండి: 'ఈ నగరానికి ఏమైంది' గ్యాంగ్ మళ్ళీ వచ్చింది.. ఈసారి అంతకు మించి.!

 

 

 

[Dada First Single, Balakrishna Dada Movie, Dada Movie Songs, Thaman Songs, Nandamuri Balakrishna, Gopichand Malineni, Kajal Aggarwal, Manchu Manoj, Telugu Songs]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com