Home

»

Latest News

'రియ‌ల్ దండుపాళ్యం'.. అంతకుమించి ఉంటుంది

Jan 28, 2022 3:09PM

దండుపాళ్యం సిరీస్ తెలుగు, క‌న్న‌డ భాషల్లో సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు 'రియ‌ల్ దండుపాళ్యం' పేరుతో మరో సినిమా ప్రేక్షకుల ముందు రాబోతుంది.

రామా నాయ‌క్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వైష్ణో దేవి ప‌తాకంపై రాగిణి ద్వివేది, మేఘ‌న రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందిన చిత్రం 'రియ‌ల్ దండుపాళ్యం'. మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వంలో సి.పుట్ట‌స్వామి నిర్మించారు.  ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శుక్రవారం ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీఎఫ్‌పీసీ సెక్ర‌ట‌రి టి. ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ.. "మ‌గాడి దాష్టీకానికి ఆడ‌వారు ఎలా బ‌ల‌వుతున్నారో దండు పాళ్యం గ‌త సిరీస్ లో చూపించారు. కానీ  ఈ రియ‌ల్ దండుపాళ్యంలో మ‌హిళ‌లు వారిపై జ‌రిగే అకృత్యాలు, అన్యాయాల‌పై తిర‌గ‌బ‌డితే ఎలా ఉంటుందో చూపించే ప్ర‌య‌త్నం చేసార‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ ట్రైల‌ర్ చూశాక ఒక క‌ర్తవ్యం, ప్ర‌తిఘ‌ట‌న‌, మౌన‌పోరాటం చిత్రాలు గుర్తొచ్చాయి. ఈ సినిమా ప్ర‌తి మ‌హిళ చూడాలి.  ఇన్ స్పైర్ అవ్వాలి. రాగిణి యాక్ష‌న్ ఎపిసోడ్స్ అద్భుతంగా చేసింది. ఫిబ్ర‌వ‌రి 4న వ‌స్తోన్న ఈ చిత్రం పెద్ద స‌క్సెస్ సాధించాలి" అని అన్నారు.

నిర్మాత సి.పుట్ట‌స్వామి మాట్లాడుతూ.. "తెలుగు, క‌న్న‌డ భాషల్లో దండుపాళ్యం సిరీస్ గ్రాండ్ స‌క్సెస్ అయిన‌ సంగ‌తి తెలిసిందే.  ఇప్పుడు వాటన్నింటినీ మించేలా `రియ‌ల్ దండుపాళ్యం ఉండ‌బోతుంది`. సొసైటీలో మగాళ్ళ వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ ‘రియల్ దండుపాళ్యం’. ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎంతో  రియ‌లిస్టిక్ గా  తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు మ‌హేష్.  ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న ఎన్నో సంఘ‌ట‌న‌ల‌కు అద్దం ప‌ట్టేలా ఈ సినిమా ఉంటుంది. అన్ని సెంట‌ర్స్ లో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్ర‌మ‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది." అన్నారు.

న‌టి రాగిణి ద్వివేది మాట్లాడుతూ.. "ఈ చిత్రాన్ని ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాను. టీమ్ అంతా కూడా ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశారు. డైర‌క్ట‌ర్ రియ‌ల్ ఇన్స్ డెంట్స్ బేస్ చేసుకుని ఈ సినిమాను ఎంతో రియ‌లిస్టిక్ గా తెర‌కెక్కించారు. గ‌తంలో వ‌చ్చిన సిరీస్ క‌న్నా రియ‌ల్ దండుపాళ్యం అద్భుతంగా ఉండ‌బోతుంది. తెలుగులో తొలి సారి విడుద‌ల‌వుతోన్ననేను న‌టించిన యాక్ష‌న్ సినిమా ఇది. ఎంతో ఎగ్జైయిటింగ్ గా ఉంది. తెలుగులో మ‌రో పెద్ద చిత్రంలో న‌టించాను. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. ఫిబ్ర‌వ‌రి 4న గ్రాండ్ గా రిలీజ్ అవుతోన్న రియ‌ల్ దండుపాళ్యం చిత్రాన్ని స‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నా" అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com