Home

»

Latest News

నానితో సేమ్ టు సేమ్!

Jan 28, 2022 3:03PM

తెలుగునాట అగ్ర క‌థానాయ‌కుల‌కు కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ అందించే నిర్మాణ సంస్థ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్  బేన‌ర్ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, కేవ‌లం టాప్ స్టార్స్ తోనే కాకుండా.. మిడ్ రేంజ్ హీరోల‌తోనూ, బ‌డ్డింగ్ హీరోల‌తోనూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది ఈ పాపుల‌ర్ ప్రొడ‌క్ష‌న్ హౌస్.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రాల్లో `అంటే.. సుంద‌రానికీ!` ఒక‌టి. నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ ఈ సినిమాని `బ్రోచేవారెవ‌రురా` ఫేమ్ వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపుగా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా వేస‌విలో వినోదాలు పంచ‌నుంది. కాగా, ఈ సినిమాతో మాలీవుడ్ బ్యూటీ న‌జ్రీయా న‌జీమ్ టాలీవుడ్ లో నేరుగా నాయిక‌గా ఎంట్రీ ఇస్తోంది.

Also Read: `దేవి`, `కుమారి` బాట‌లో `స‌ఖి` వెళుతుందా!?

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే..గ‌తంలో నానితో మైత్రీ నిర్మించిన `గ్యాంగ్ లీడ‌ర్`తోనూ ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. అంటే.. నానితో సినిమాల‌ను నిర్మించిన రెండు సంద‌ర్భాల్లోనూ నాయిక‌ల‌ప‌రంగా మైత్రీ సేమ్ `డెబ్యూ` స్ట్రాట‌జీని ఫాలో అయింద‌న్న‌మాట‌. మ‌రి.. `గ్యాంగ్ లీడ‌ర్`కి అచ్చిరాని డెబ్యూ ఫ్యాక్ట‌ర్.. `అంటే సుంద‌రానికీ!` అయినా వ‌ర్క‌వుట్ అవుతుందేమో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com