Home

»

Latest News

ఈ సారి 'ఇరుముడి'ని మించిన టైటిల్: ఏడూకొండల వాడ వెంకటేశా!

Oct 1, 2026 3:37PM

 

'ఇరుముడి'తో మాస్ మహారాజ రవితేజ మంచి జోష్ లో ఉన్నాడు. ఫ్యాన్స్ అయితే మా మాస్ మహారాజా ఇక పట్టిందల్లా బంగారం అనే మూడ్ లో సరిపోదా శనివారం ఫేమ్ 'వివేక్ ఆత్రేయ' దర్శకత్వంలో తెరకెక్కే మూవీ సెట్స్ పైకి వెళ్లే శుభ సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కథాంశం ఒక సరికొత్త హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్‌లో ఉండబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా 'తులా భారం’ అనే విభిన్నమైన మరియు శక్తివంతమైన టైటిల్‌ని  పరిశీలించి ఖరారు చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌కి 'తులా భారం' అనే పేరును లాక్ చేయడం వెనుక పెద్ద కాన్సెప్ట్ దాగ ఉందనే చర్చ మొదలైంది. ఇప్పటివరకు రవితేజ తన సుదీర్ఘ కెరీర్‌లో మాస్, యాక్షన్, సెంటిమెంట్, ప్యూర్ కామెడీ జానర్లలో అనేక సినిమాలు చేసినప్పటికీ, పూర్తి స్థాయి హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్‌‌ను ఎంచుకోవడం ఇదే ప్రథమం.


ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం: ఈ సారి అలాంటి అనుమానాలు వద్దు!

 

 

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇప్పటికే 100 శాతం పూర్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కథ, కథనాలపై సంపూర్ణ స్పష్టతతో ఉన్న దర్శకనిర్మాతలు ఈ దసరా పండుగ శుభ ముహూర్తాన సినిమాని  అధికారికంగా లాంచ్ చేసి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా 'ఓజీ' బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా 'తులాభారం' అనే టైటిల్ ఫిక్స్ అయితే బాక్స్ ఆఫీస్ తుక్కు రేగిపోవడమే. పైగా ఏడుకొండల వాడి భక్తులతో పాటు అన్ని దేవుళ్ళ భక్తుల హృదయాల్లో తులాభారానికి ఎంతో విశిష్టత ఉంది.

 

[Ravi Teja And Vivek Athreya New movie Title, Ravi Teja, Vivek Athreya, Tula Bharam, Ravi Teja Next Movie, RT Vivek Athreya Movie, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]
 
    

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com