Home

»

Latest News

ఆదర్శ కుటుంబం: ఈ సారి అలాంటి అనుమానాలు వద్దు!

Oct 1, 2026 3:14PM

 

నిర్మాతగా అభిమానులని సంపాదించడం చాలా అరుదు. అలాంటి అరుదైన వాళ్ళల్లో నాగ వంశీ ఒకరు. ఈ నెల 9 న విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల  'ఆదర్శ కుటుంబం'తో మరో సారి సెల్యులాయిడ్ పై అడుగుపెట్టనున్నాడు.

సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉండే నాగవంశీ రీసెంట్ గా' మా బ్యానర్ పై మీకు అనుమానం ఉండవచ్చు. కానీ ఈ సారి ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. అనుకున్న డేట్ కే 'ఆదర్శ కుటుంబం' వస్తుంది. 6 న ట్రైలర్ లాంచ్ ఉంటుంది.మరుసటి రోజు నుంచి బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. దసరాని మా సినిమాతోనే స్టార్ట్ చెయ్యండని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసాడు.


ఇది కూడా చదవండి: వారణాసి తర్వాత ప్రియాంక చోప్రా నెక్స్ట్ హీరో ఎవరో తెలుసా! దశాబ్దకాలం నిరీక్షణకి తెరపడనుందా?

 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌‌పై  నాగ వంశీ బాబాయి  ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా నాగవంశీ సమర్పకుడు. వెంకటేష్ సరసన కేజియఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, నారా రోహిత్, నివేతా పేతురాజ్, డింపుల్ హయతి, సత్య, రావు రమేష్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో  చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'నారాయణమ్మ' లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. 

 

[Naga Vamsi About Aadarsha Kutumbam, Aadarsha Kutumbam Trailer Update, Aadarsha Kutumbam, Venkatesh Aadarsha Kutumbam Trailer, Trivikram Srinivas, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com