Home

»

Latest News

'మైసా' టీజర్ రెస్పాన్స్: అలసిపోయాను ఆగిపోయాను ఓడిపోయాను.. రష్మికను ఇలా ఎప్పుడూ చూసుండరు.!

Sep 21, 2026 11:34AM

రష్మిక మందన్న నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'మైసా'. ఈ చిత్రంలో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక , ఆ పాత్రలో ఒదిగిపొవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న'మైసా' మూవీ, ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్‌తో ఆసక్తిని రేకెత్తించింది. నవంబర్ 27న ‘మైసా’ గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు.

“అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను” అంటూ రష్మిక చెప్పే డైలాగ్‌తో ఆమె పాత్రలోని ఇంటెన్సిటీని పరిచయం చేశారు. భయపడని, వెనక్కి తగ్గని గిరిజన మహిళగా ఆమె పాత్ర అద్భుతంగా ఉంది. తాను ఎదుర్కొనే ఎన్నో సవాళ్లు, సామాజిక అడ్డంకులను అధిగమిస్తూ.. ప్రతి సమస్యను ఎదురించి పోరాడే ఒంటరి యోధురాలిగా మైసా కనిపిస్తుంది.  

గోండ్ గిరిజన మహిళ పాత్రలో రష్మిక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టారు. బైక్‌ను ఎంతో ధైర్యంగా నడపడంతో పాటు.. అండర్‌వాటర్ సీక్వెన్స్‌లలోనూ సాహసోపేతమైన స్టంట్స్ చేశారు. పాత్ర కోసం రష్మిక తనను తాను పూర్తిగా మార్చుకున్న తీరు టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఇంటెన్సిటీ, రా రేజ్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. రవీంద్ర పుల్లే తన విజన్ ను స్క్రీన్‌పై అద్భుతంగా ప్రజెంట్ చేశారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా నీటి అడుగున రష్మిక గొడ్డలి పట్టుకుని కూర్చున్న షాట్ హాంటింగ్‌గా ఉండటంతో పాటు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ సీక్వెన్స్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.

ఇది కూడా చదవండి: విడాకులు.. సంచలనంగా మారిన కాజల్ అగర్వాల్ కామెంట్స్.!

సినిమాటోగ్రాఫర్ శ్రేయాస్ పి. కృష్ణ దర్శకుడి విజన్‌ను అద్భుతమైన విజువల్స్‌గా మలిచారు. జేక్స్ బిజోయ్ అందించిన ఇంటెన్స్ స్కోర్ సినిమా డార్క్, యాక్షన్ వరల్డ్‌ను మరింత ఎలివేట్ చేస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్  కేచ రూపొందించిన యాక్షన్ బ్లాక్స్ రా, షార్ప్‌గా టాప్ క్లాస్ లో కనిపిస్తున్నాయి. మొత్తంగా ‘మైసా’ టీజర్ స్టన్నింగ్ విజువల్స్, యాక్షన్ తో సినిమాపై అంచనాలు పెంచుతోంది.

'మైసా' టీజర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కొద్ది గంటల్లోనే తెలుగు టీజర్ కి 1 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. రష్మిక పర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్, విజువల్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

మీకు నచ్చవచ్చు: అందాల ఆడబొమ్మ.. బాలయ్య ఆల్ టైం క్లాసిక్ సాంగ్.! 

 

 

 

[Mysaa Teaser, Rashmika Mandanna, Mysaa Movie, Rashmika Mysaa, Rawindra Pulle, Jakes Bejoy, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com