
ప్రెజెంట్ మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ముఖాలు చూస్తుంటే మతాబుల్లా వెలిగిపోతూ ఉన్నాయి. ఒక రకంగా వాళ్లంతా ఈ రోజు కోసమే ఎప్పట్నుంచో ఎదురుచూస్తూ ఉన్నారు
అందుకు భారతీయ చలనచిత్ర రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ నగరం వేదిక కానుంది.
చిరంజీవి, ప్రముఖ సినిమా పంపిణీ, నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కలిసి ప్రపంచంలోనే అత్యంత భారీ సినిమా స్క్రీన్‌ని హైదరాబాద్ లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్న స్క్రీన్ సైజ్, సాంకేతిక వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక స్క్రీన్ దాదాపు 120 అడుగుల వెడల్పు, 69 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద శాశ్వత ఐమాక్స్ స్క్రీన్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన జర్మనీలోని 'ట్రాంపలాస్ట్ లియోన్‌బర్గ్' (Traumpalast Leonberg) థియేటర్ స్క్రీన్ కొలతలు 127 అడుగుల వెడల్పు, 69 అడుగుల ఎత్తుతో దాదాపు 8,770 చదరపు అడుగుల విస్తీర్ణంలో 574 రెక్లైనర్ సీట్లతో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని ఐమాక్స్ మెల్‌బోర్న్ (105 అడుగులు x 75 అడుగులు), అమెరికాలోని రాయల్ సినిమాస్ (101 అడుగులు x 76.2 అడుగులు), ఏఎమ్‌సీ లింకన్ స్క్వేర్ (101 అడుగులు x 75.6 అడుగులు) మరియు హైదరాబాద్‌లోని ప్రసాద్స్ పిసిఎక్స్ (98 అడుగులు x 64 అడుగులు) ప్రముఖ పెద్ద స్క్రీన్లుగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో నిర్మించే ఈ నూతన స్క్రీన్, గ్లోబల్ రికార్డులను సైతం సవాలు చేసే స్థాయి డైమెన్షన్స్, అత్యాధునిక డ్యూయల్ లేజర్ ప్రొజెక్షన్ మరియు హై-ఎండ్ 3D సరాండ్ సౌండ్ సిస్టమ్‌తో రూపొందనుంది. నగరంలో సుదీర్ఘ కాలంగా కొరవడిన ప్రామాణిక భారీ లాార్జ్-ఫార్మాట్ ఐమాక్స్ తరహా థియేట్రికల్ అనుభూతి లోటును తీర్చడమే ఈ మెగా వెంచర్ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ గ్లోబల్ విజువల్ వండర్ గురించి వార్తలు హల్ చల్ చేస్తుండగా, చిరంజీవి టీమ్ మరియు ఏషియన్ సినిమాస్ యాజమాన్యం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ మెగా ప్రాజెక్ట్ గనుక కార్యరూపం దాల్చితే, హైదరాబాద్ ప్రపంచ సినిమా పటంలో అంతర్జాతీయ సినిమాటిక్ అనుభవానికి సరికొత్త వేదికగా మారడం ఖాయం.
ఇది కూడా చదవండి: భాగ్యశ్రీ బోర్సే సంచలన నిర్ణయం: ఫ్యాన్స్ షాక్

ఇప్పటికే వినోద రంగానికి హబ్‌గా మారిన హైదరాబాద్‌లో ఈ తరహా మెగా ప్రాజెక్ట్ రాబోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌ను హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ మరియు కార్పొరేట్ కేంద్రమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేదా గచ్చిబౌలి ప్రాంతంలో నెలకొల్పడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏషియన్ సినిమాస్ ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏఎమ్‌బీ సినిమాస్ (AMB Cinemas), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఏఏఏ సినిమాస్ (AAA Cinemas), మరియు విజయ్ దేవరకొండతో కలిసి ఏవీడీ సినిమాస్ (AVD Cinemas) నిర్మించి ప్రేక్షకులకు ప్రీమియం థియేట్రికల్ అనుభూతిని అందించడంలో సక్సెస్ అయ్యాయి.'ఏషియన్ చిరంజీవి సినిమాస్' (Asian Chiranjeevi Cinemas - ACC) లేదా 'ఏషియన్ మెగాస్టార్ సినిమాస్' (Asian Megastar Cinemas - AMC) పేరుతో ఉండవచ్చనేది కూడా టాక్.
మీకు నచ్చవచ్చు: పల్లెల్లో ప్రాజెక్ట్ పండుగ: పుణ్యం చేసుకుంది ఎవరు!
[Chiranjeevi, Maltiplex, Chiranjvee Worlds Largest Cinema Screen Hyderabad, Asian Chiranjeevi Cinemas, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






