
సినిమా.. సమస్త ప్రేక్షక లోకానికి సినిమాని మించిన శక్తివంతమైన ఎంటర్ టైన్ మెంట్ గన్ ఇంకోటి పుట్టదు. పుట్టబోదు. ప్రేక్షకుల బాధలు, టెన్షన్ మొత్తాన్ని పోగొట్టే పవర్ ఫుల్ మెడిసిన్ కూడా. పైగా తన అభిమాన హీరో సినిమా చూసాక కొండంత ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే సినిమా ఇచ్చే ఊహించని సన్నివేశాలు, ట్విస్టులు, సాంగ్స్ లోని స్టెప్స్ చూసి బయటకి వచ్చిన ప్రేక్షకుడు మహదానందాన్ని పొంది 'సినిమా' అనేది ఉండగా నాకేంటి దిగులు అని కింగ్ లా ఫీలవుతాడు.
కానీ ఎప్పుడు పుట్టిన పైత్యమో,ఎవడు నేర్పిన పైత్యమో తెలియదు గాని ప్రమోషన్స్ పేరుతో వచ్చే టీజర్, ట్రైలర్ తో మెయిన్ మెయిన్ సీన్స్ మొత్తాన్ని చెప్పేస్తున్నారు. సాంగ్స్ రిలీజ్ చేసే తీరు అయితే ఇంకా దారుణం. హీరో వేసే అందమైన స్టెప్స్ ని చూపించేస్తున్నారు. దీంతో థియేటర్స్ లో మజా ఉండటం లేదు. ఫ్యాన్స్ అయితే గోల చేస్తారు కానీ 200 % ప్లాస్టిక్ ఆనందం.ఒకప్పుడు ఆ స్టెప్స్ కి కూడా రిపీట్ ఆడియెన్స్ ఉండేవాళ్ళు.ఏది ఏమైనా సినిమా ప్రమోషన్లు అంటే ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాలి, థియేటర్ వైపు వారి అడుగులు పడేలా చేయాలి. కానీ నేటి టాలీవుడ్ చిత్రసీమలో ప్రమోషన్ల పేరిట జరుగుతున్న అతి కొందరి సీనియర్ ప్రేక్షకులకు, అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు. రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం విషయంలోనూ ఇదే చర్చ మొదలైంది. సినిమా ప్రమోషన్ల పేరిట ఒకేసారి టీజర్, సుదీర్ఘమైన ట్రైలర్, మరియు కీలకమైన డాన్స్ వీడియోలను వరుసపెట్టి సోషల్ మీడియాలో విడుదల చేయడంపై సినీ ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు సినిమా చూడకముందే కథ ఏంటి, క్లైమాక్స్ లేదా ప్రధాన మలుపులు ఎలా ఉండబోతున్నాయో టీజర్ మరియు ట్రైలర్‌లలోనే స్పష్టంగా చూపించేస్తే ఇక థియేటర్లలో ప్రేక్షకులు పొందే మజా ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: 'సిగ్మా' ట్రైలర్ ఎలా ఉంది: విజయ్ కొడుకు సందీప్ కిషన్ ని ఎంచుకోవడానికి కారణం:

గర్ల్ ఫ్రెండ్ అని కాదు, అన్ని సినిమాలు ఇంతే .ప్రస్తుత డిజిటల్ యుగంలో 100% ప్రమోషనల్ రీచ్ సాధించాలనే తపనతో చిత్ర యూనిట్లు సోషల్ మీడియాలో కంటెంట్‌ను విచ్చలవిడిగా వదిలేస్తున్నాయి.పూర్వం ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే కేవలం 1 నిమిషం నిడివి గల గ్లింప్స్ లేదా ఒక చిన్న టీజర్ మాత్రమే విడుదల చేసేవారు. దాంతో ప్రేక్షకులు కథపై తమదైన రీతిలో ఊహాగానాలు చేస్తూ, అసలు సినిమాలో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో 80% కంటే ఎక్కువ మంది థియేటర్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ప్రమోషన్ల వ్యామోహంలో పడి కథను మొత్తం అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు ఫ్రీగా యూట్యూబ్‌లోనే చూపించేస్తున్నారు. ట్రైలర్‌లోనే 90% సన్నివేశాలు తెలిసిపోతే, మొదటి రోజు థియేటర్‌లో 200 నుండి రూ. 300 వరకు టికెట్ కొని చూడటంలో అర్థం లేదు అని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
కాబట్టి హీరోలకి, మేకర్స్ కి చెప్పేదేంటంటే సినిమాని మించిన దివ్యౌషధం ఇంకోటి లేదు. అభద్రతా భావంతో ఆ ఔషధాన్ని ఉన్న శక్తిని తగ్గించకండని సినీ ప్రియులు కూడా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు.
మీకు నచ్చవచ్చు : ప్రేక్షకులు మరి అంత ఎర్రి ఎంగళప్పల్లా కనిపిస్తున్నారా:ఒక మాదిరిగా కూడా కాదా!
[Telugu Cinema Trailer Trolls, Rashmika Girlfriend Movie Trailer Troll, Movie Trailer Trolls, Telugu cinema Trailers, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]






