Home

»

Latest News

ఎన్టీఆర్ స్టైల్‌ని కాపీ కొట్టిన చెర్రీ

Dec 5, 2016 2:32PM

ధృవ‌లో రామ్ చ‌ర‌ణ్ లుక్ అద్బుత‌హా... అని మెగా ఫ్యాన్స్ పండ‌గ చేసుకొంటున్నారు. మ‌రీ ముఖ్యంగా ష‌ర్టు విప్పి తొలిసారి చ‌ర‌ణ్ బాడీ చూపిస్తుండ‌డం మెగా అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకొంటోంది.  పాట‌ల్లో, ఫైట్ సీన్ల‌లో చ‌ర‌ణ్ సిక్స్ ప్యాక్ చూపించబోతున్నాడ‌న్న విష‌యం ట్రైల‌ర్లు, ప్ర‌చార చిత్రాలు చూస్తుంటేనే అర్థ‌మైపోతోంది. ధృవ సినిమాలో చ‌ర‌ణ్ ఓ  కొత్త లుక్‌లో క‌నిపించ‌డం ఖాయం. అయితే... ఆ లుక్ ఎన్టీఆర్‌ని కాపీ కొట్టిందే అంటూ కొంత‌మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో కొన్ని పిక్స్ పోస్ట్ చేయ‌డం ఆస‌క్తిగా మారింది. టెంప‌ర్ సినిమాలోనూ ఇలానే ఎన్టీఆర్ బీచ్  లో న‌డుచుకొంటూ వ‌స్తున్న స్టిల్‌నీ.. చ‌ర‌ణ్ స్టిల్‌నీ ప‌క్క ప‌క్క‌న పెట్టి పోలిక‌లు తీస్తున్నారు.

ఎన్టీఆర్ లానే చ‌ర‌ణ్ కూడా ష‌ర్టు విప్ప‌డం, బ్లూ జీన్ వేసుకోవ‌డం, మెళ్లో ఓ తాడు లాకెట్‌లా ధ‌రించ‌డం ఇవ‌న్నీ పోలిక‌లే. దాంతో ఎన్టీఆర్‌ని చూసి చ‌ర‌ణ్ కాపీ కొట్టాడంటూ నంద‌మూరి అభిమానులు ప్ర‌చారం ఉధృతం చేస్తున్నారు. బాడీ విష‌యంలోనేనా, లేదంటే అన్ని విష‌యాల్లోనూ చ‌ర‌ణ్ టెంప‌ర్‌ని ఫాలో అయిపోయాడా అనేది సినిమా చూస్తే గానీ తెలీదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com