Home

»

Latest News

ర‌కుల్ ఇలా రెచ్చిపోయిందేంటి?

Dec 5, 2016 3:02PM

టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ ఎవ‌రంటే ఇప్పుడు అనుష్క‌, స‌మంత‌, త‌మ‌న్నా పేర్లు చెప్ప‌డం లేదెవ్వ‌రూ. ఆ స్థానాన్ని ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడో ఆక్ర‌మించేసింది. ర‌కుల్ చేతిలో ఉన్న సినిమాలు, ఆమె అందుకొంటున్న పారితోషికం, ద‌క్కించుకొంటున్న విజ‌యాలూ ఇవి చూస్తే ర‌కుల్ స్థానం ఏమిటో అర్థ‌మైపోతుంది. దొరికిన ప్ర‌తీ అవ‌కాశాన్నీ ర‌కుల్ స‌ద్వినియోగం చేసుకొంటూ వెళ్తోంది. అందుకే ర‌కుల్‌కి అంత క్రేజ్‌.  రామ్ చ‌ర‌ణ్ తో క‌ల‌సి న‌టించిన ధృవ ఈవారమే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాలో ర‌కుల్ పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్యం లేద‌ని, కేవ‌లం పాటల్లో మాత్ర‌మే క‌నిపిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే పాట‌ల్లో త‌న మ్యాజిక్ చూపించాల‌ని ర‌కుల్ డిసైడ్ అయిపోయింది. దానికి త‌గ్గ‌ట్టు ధృవ‌లోని ర‌కుల్‌పై ఓ పాట‌ని హాట్ హాట్ గా తెర‌కెక్కించారు.

ప‌రేషానురా అనే పాట‌లో ర‌కుల్ విజృంభించి మ‌రీ గ్లామ‌ర్ ఒలికించింది. ర‌కుల్ కెరీర్‌లోనే... ఇది హాటెస్ట్ సాంగ్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. దానికి తోడు చ‌ర‌ణ్ కూడా ఈ పాట మొత్తం ర‌కుల్‌దే.. నేను గెస్ట్‌లా క‌నిపిస్తా.. అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ప‌రేషాను సాంగ్ టీజ‌ర్‌ చూసిన‌వాళ్లంతా ర‌కుల్ అందాల గురించే మాట్లాడుకొంటున్నారు. ఈ పాట‌తో.. టాలీవుడ్‌ని హీటెక్కించ‌డం ఖాయ‌మ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com