Home

»

Latest News

Ramayana Movie Review Telugu: రామాయణం మూవీ రివ్యూ 

Nov 5, 2026 12:02PM

 


-సినిమా పేరు: రామాయణం
-న‌టీన‌టులు:  రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, శోభన, అరుణ్ గోవిల్, రకుల్ ప్రీత్ సింగ్,  కాజల్, రవి దుబే  తదితరులు 
-సినిమాటోగ్ర‌ఫీ: పంకజ్ కుమార్, మహేష్ లిమాయే
-ఎడిటింగ్: హుఫేజా లోకండ్ వాలా  
-మ్యూజిక్: ఏ ఆర్ రెహ్మాన్, హన్స్ జిమ్మర్ 
-నిర్మాత‌లు: నమిత్ మల్హోత్రా, యష్ 
-బ్యానర్స్  : ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ 
-రచన,దర్శకత్వం: నితిన్ తివారి 
-రిలీజ్ డేట్ : నవంబర్ 5 ,2026 

భారతీయుల సంస్కృతితో ముడి పడిన రామ చరిత్ర  'రామాయణం' గురించి అందరకి తెలిసిందే. మళ్ళీ ఈ రోజు సెల్యులాయిడ్ పై సాక్షాత్కరించింది. మరి ఎలా ఉందో చూద్దాం.
 
కథ 

కైకసి( శోభన) రాక్షస(అసుర) జాతికి చెందిన స్త్రీ. తన పుట్టబోయే సంతానం పాండిత్యంలో సైతం ప్రావిణ్యం సంపాదించాలని 'విశర్వ' అనే మహామునిని పెళ్లి చేసుకొని పిల్లలని కంటుంది. మహా విష్ణువు తమ జాతిని సంహరిస్తున్నాడని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కైకసి పెద్ద కొడుకు దశానన తల్లి కోరుకున్నట్టే ఋషి లక్షణాల ప్రకారం సాధువుగా లలిత కలల్లో ప్రావీణ్యం సంపాదిస్తాడు. అలాంటి దశానన 'లంక' అనే మహా సామ్రాజ్యంతో పాటు   ముల్లోకాలని పరిపాలించే రావణుడి ( యష్) గా మారతాడు. రాముడు( రణబీర్ కపూర్)  అయోధ్యకి చెందిన దశరధ మహారాజు పెద్ద కుమారుడు. అనుచిత కార్యం చేయడానికి భయపడాలి కానీ, మంచి చేయడానికి భయం ఎందుకు అనే మృదుస్వభావి. అస్త్ర విద్యల్లో నైపుణ్యం గల వ్యక్తి. కాబోయే అయోధ్య చక్రవర్తి కూడా. కర్మ', విధి తన జీవితంతో ఆడుకుంటున్నాయని  చిన్న తనం నుంచే గ్రహిస్తాడు. అలాంటి రాముడు కర్మ, విధి రెండింటిని తన ఆత్మస్తైర్యంతో ఎదుర్కోవాలని అనుకుంటాడు. రాముడు ఆ విధంగా అనుకోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితుల మధ్య తన ధర్మపత్ని సీతా దేవి(సాయి పల్లవి) సోదరుడు లక్ష్మణుడు(రవి దుబే ) తన యోగక్షేమాలు చిన్నతనం నుంచే గమనిస్తూ ఉండే జటాయువు అనే పక్షి మధ్య జరిగిన సంఘటనలు ఏంటి? అనేదే రామాయణం మొదటి భాగం

ఎనాలసిస్ 
ఇలాంటి అద్భుతమైన దృశ్య కావ్యాన్ని ఈ జనరేషన్ ముందుకు తీసుకు వచ్చినందుకు మేకర్స్ కి హాట్స్ హాఫ్ చెప్పాలి. ప్రతి సన్నివేశం ఒక అద్భుతం, పాఠం, గుణపాఠం.  చాలా సినిమాల్లో విజువల్స్ ఎఫెక్ట్ చూస్తుంటే విజువల్స్ అని అర్ధమవుతుంది. కానీ రామాయణ చూస్తున్నంత సేపు ఆ ఫీలింగ్ ఉండదు. ఆ ఏరియాలోనే మనం ఉన్నట్టుగా రామాయణ ఇతిహాసంతో ట్రావెల్ అవుతాం. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే  కైకసి(శోభన) సీన్ తోనే కొత్త రామాయణని చూడబోతున్నామని అర్ధమవుతుంది. దీంతో రామాయణంకి సరెండర్ అవుతాం. దశానన (యష్) సీన్స్ తో పాటు దశానన రావణగా మారే ఎపిసోడ్ సూపర్. రాముడి(రణబీర్) జనన రహస్యం, పెద్దయ్యాక ఇంట్రడక్షన్ సీన్ అన్ని కూడా రోమాంచితంగా ఉన్నాయి. రాముడు సౌమ్యుడు కాబట్టే ఆ విధమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, షాట్ డివిజన్ చేసిన తీరు ఎక్స్ లెంట్. రాముడి ఊహల్లో సీతాదేవిని (సాయి పల్లవి) ని సీతాదేవి తన ఊహల్లో రాముడ్ని ఊహించుకునే వెర్షన్ కొత్తదనంతో నిండి కధనంకి మరింత వెలుగుని తెచ్చింది.

ఇద్దరి వివాహం జరిగిన విధానాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసుండాల్సిందేమో. వనవాసంకి వెళ్లే టోటల్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. కాకపోతే ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించే విషయంలో డైలాగ్స్ మరింత ఆర్తిగా ఉండాల్సింది. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్. సెకండ్ హాఫ్ లో చూసుకుంటే అడవిలో సన్నివేశాలు బాగానే  ఉన్నాయి.  రాముడు, శూర్పణఖ మధ్య వచ్చిన ట్రాక్ సింపుల్ గా తేల్చేసినట్టుగా ఉంది. ఆ తర్వాత వచ్చిన యాక్షన్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవల్. రావణుడుని పదితలల వాడిగా ఎందుకని అనుకుంటూ ఉంటామో వివరణలా వచ్చిన సీన్ బాగుంది. సీతాదేవిని అపహరించే సీన్ బాగానే ఉన్నా,ఆ ఎపిసోడ్ ని బాగా లెన్త్ లో తెరకెక్కించి ప్రేక్షకుల్లో సీతాదేవిని అపహరించేటప్పుడు క్యూరియాసిటీని కలిగించాల్సింది.


నటీనటులు, సాంకేతిక నిపుణులపనితీరు 

రాముడిగా రణభీర్ పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సాక్షాత్తు కోదండ రాముడే కళ్ళ ముందు ఉన్నట్టుగా మెస్మరైజ్ చేసి పడేసాడు. మరి ముఖ్యంగా అత్యంత కష్ట తరంతో కూడుకున్న సాత్వికమైన నటనలో కళ్ళు, ముఖంలో ఒకే రకమైన ఎక్స్ ప్రెషన్ ఇవ్వడంలో నభూతో నబిష్యత్. ఒక రకంగా తన జీవితం ధన్యమైనట్టే. సాయి పల్లవి కూడా అంతే, సీతాదేవిగా ఒక రేంజ్ పెర్ఫార్మ్ చేసింది. రావణుడిగా యష్ నూటికి నూరుపాళ్లు సెట్ అయ్యాడు. ఇంచు కూడా తగ్గకుండా మేకర్స్ తనపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కానీ విధంగా రావణ క్యారక్టర్ లో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చాడు. మిగతా క్యారెక్టర్స్ లో చేసిన రకుల్, రవి దూబే, అరుణ్ గోవిల్ ఇలా అందరూ రామాయణం కోసమే మేము నటనలో ఓనమాలు దిద్దినట్టుగా మెప్పించారు. లెజండ్రీ మేకర్  నితీష్ తివారి దర్శకత్వం ఒక రేంజ్ లో ఉంది. ప్రతి షాట్ ని అద్భుతమైన దృశ్య కావ్యంగా మలచాలనే తపనతో తీర్చిదిద్దారు. కాకపోతే రచయిత కోణంలో ఆలోచిస్తే భావోద్వేగం కలిగించే సన్నివేశాలని మరింత లెన్త్ గా చూపించాల్సిది. నమిత్ మల్హోత్రా నుంచి విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ విలువలు రామాయణకి మరింత వన్నె తెచ్చాయి. ఏ ఆర్ రెహ్మాన్, హన్స్ జిమ్మర్  నుంచి బ్యాక్ గ్రౌండ్  స్కోర్ , ఫొటోగ్రఫీ రామాయణకి అదనపు బలంగా నిలిచాయి. 

బలాలు

1 .రణబీర్, యష్, సాయిపల్లవితో పాటు ఆల్ ఆర్టిస్ట్ పెర్ ఫార్మెన్స్
2 . కథ, కథనం
3 . డైరెక్షన్ 
4 . విజువల్ ఎఫెక్ట్స్ 
5 .నిర్మాణ విలువలు 
6 . ఫోటోగ్రఫీ  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
7 . కాస్ట్యూమ్స్ 
8 . ఫస్ట్ హాఫ్ 

బలహీనతలు 
1 . సెకండ్ హాఫ్ లో ఎక్కువ కథని చెప్పకపోవడం

 

చివరిగా చెప్పాలంటే ఎన్నో రామాయణాలు వచ్చినా ఈ నయా 'రామాయణం' కొత్తగా, క్వాలిటీ గా ఉంది. నిరుత్సాహపరచదు.

 

రేటింగ్ 2.75/5

                                                                                                                   అరుణాచలం 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com