Home

»

Latest News

'ఇట్లు అర్జున' హీరో అనీష్ ఎవరు?.. నాగార్జున, ఎన్టీఆర్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదేనా.?

Nov 5, 2026 11:24AM

సినిమా ఇండస్ట్రీలోకి కొత్త నటులు పరిచయం కావడం సహజమే. కానీ ఎలాంటి స్టార్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వస్తున్న ఓ కొత్త నటుడికి అక్కినేని నాగార్జున అండగా నిలవడం, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ప్రశంసించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ కొత్త నటుడు ఎవరు? ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇండస్ట్రీలో ఇంతమంది ప్రముఖులు అతడిని సపోర్ట్ చేయడానికి కారణమేంటి?

ఆ నటుడే అనీష్. ఆయన హీరోగా పరిచయమవుతున్న సినిమానే 'ఇట్లు అర్జున'. ఈ సినిమాను నాగార్జున సమర్పిస్తుండగా, తాజాగా ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేశారు. దీంతో అనీష్ గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

అనీష్ ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త మహేశ్ రెడ్డి తనయుడు. ఆయన కుటుంబానికి సినిమా ఇండస్ట్రీతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా అక్కినేని నాగార్జునతో అనీష్ ఫ్యామిలీకి ప్రత్యేకమైన పరిచయం ఉంది. అందుకు కారణం మహేశ్ రెడ్డి గతంలో నాగార్జున నటించిన 'శిరిడి సాయి', 'ఓం నమో వేంకటేశాయ' సినిమాలను నిర్మించడమే. ఈ రెండు సినిమాలతో నాగార్జున, మహేశ్ రెడ్డి మధ్య మంచి అనుబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. వీరిద్దరూ బిజినెస్ పార్ట్‌నర్స్ అనే ప్రచారం కూడా ఉంది. 

అనీష్ తొలి సినిమాను నాగార్జున ప్రజెంట్ చేయడం వెనుక ఈ పాత అనుబంధం కూడా ఓ కారణమని చర్చ జరుగుతోంది. అయితే కేవలం పరిచయం మాత్రమే కాకుండా సినిమా కంటెంట్ కూడా నాగార్జునకు నచ్చిందని తెలుస్తోంది. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ముందుండే నాగార్జున.. 'ఇట్లు అర్జున' కాన్సెప్ట్, అనీష్ నటన నచ్చడంతో ఈ సినిమాకు అండగా నిలిచారు.

ఇక తాజాగా ఎన్టీఆర్ కూడా అనీష్‌కు తన మద్దతు ప్రకటించారు. 'ఇట్లు అర్జున' ట్రైలర్‌ను విడుదల చేసిన తారక్.. తొలి సినిమాతోనే ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రను ఎంచుకోవడం సాహసమని ప్రశంసించారు. ముఖ్యంగా సినిమాలో అనీష్ ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా నటించడం తనకు నచ్చిందని అభినందించారు. అనీష్ ఫ్యామిలీతో ఎన్టీఆర్ కి కూడా బాండింగ్ ఉందని తెలుస్తోంది. ఓ కొత్త నటుడి సినిమా ట్రైలర్‌ను ఎన్టీఆర్ స్థాయి స్టార్ విడుదల చేయడం, పైగా అతడి నటనను ప్రత్యేకంగా ప్రశంసించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమాలో అర్జున్ అనే మాటలు రాని యువకుడిగా అనీష్ కనిపించనున్నారు. అతడికి కీర్తి (అనస్వర రాజన్) అంటే ఎంతో ఇష్టం. అయితే ఈ ప్రేమకథలోకి ఓ భారీ క్రైమ్ ఎపిసోడ్ వచ్చి చేరుతుంది. ఓ దొంగతనం కేసులో పోలీసులు అర్జున్ కోసం వెతుకుతుంటే.. మరోవైపు రూ.1000 కోట్ల డీల్‌కు సంబంధించిన పెన్‌డ్రైవ్ కోసం ఓ గ్యాంగ్ అతడిని, కీర్తిని వెంటాడుతుంది.

అసలు ఆ పెన్‌డ్రైవ్‌కు అర్జున్‌కు సంబంధం ఏంటి? మాటలు రాని యువకుడిగా అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రేమ కోసం మొదలైన ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది సినిమాలో చూడాలి. థమన్ సంగీతం అందిస్తుండగా, మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరి పలువురు స్టార్స్ అండతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న అనీష్.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: ఇట్లు అర్జున ట్రైలర్.. నాగార్జున ప్రజెంటేషన్‌లో కొత్త ప్రయోగం.!

 

 

 

[Itllu Arjuna Hero Aniesh Family Background, Itllu Arjuna Movie, Actor Aniesh, Producer Mahesh Reddy, Shiridi Sai, Om Namo Venkatesaya, Nagarjuna, Jr NTR, Anaswara Rajan]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com