
అయోధ్య రాముడు వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద తన జైత్రయాత్రని కంటిన్యూ చేస్తున్నాడు. దీంతో ఒక్కో రికార్డు జై శ్రీరామ్ అంటూ సైడ్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఒక రకంగా రోజు రికార్డుల న్యూస్ వినపడుతూనే ఉంది. తాజాగా ధురంధర్ 2 ని ఆ రకంగా కూడా బీట్ చేసిన చిత్రంగా తన దిశ, దశ చాటింది.
రామాయణ ఇప్పటికి వచ్చి పదకొండు రోజులు. ఈ పదకొండు రోజులకి 1384 .50 కోట్ల గ్రాస్ ని సాధించింది. ధురంధర్ 2 అదే పదకొండు రోజులకి 1354 .92 కోట్లు రాబట్టింది. దీంతో ధురంధర్ 2 తలవంచక తప్పలేదు. ముందు ముందు కూడా తలవంచాల్సి వస్తుందేమో అని బెంగ కూడా ధురంధర్ 2 కి పట్టుకుంది.సినిమా విడుదలైన తొలి రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రామాయణం అగ్రస్థానంలో నిలిచింది. ఈ చిత్రం ఏకంగా 8 రోజుల పాటు నిలకడగా రోజుకు . 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డును నమోదు చేసింది.
ఇంతకుముందు ఏ సినిమా కూడా ఈ స్థాయిలో వరుస రోజుల్లో ఈ మైలురాయిని అందుకోలేదు. ఇక సౌత్ రాష్ట్రాల విషయానికి వస్తే, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే 86.35 కోట్ల నెట్ వసూళ్లను సాధించి, గతంలో వచ్చిన కొన్ని పెద్ద చిత్రాల పూర్తి జీవితకాల బిజినెస్ రికార్డులను సైతం కేవలం ఐదు రోజుల్లోనే క్రాస్ చేసి సంచలనం సృష్టించింది.అంతేకాకుండా, సినిమా విడుదలైన తర్వాత వచ్చిన రెండో ఆదివారం నాడు బాక్సాఫీస్ వద్ద అసలు సిసలైన సునామీ సృష్టించింది.

ఈ రెండో ఆదివారం నాడు భారతదేశంలో ఈ చిత్రం ఏకంగా రూ. 75 కోట్ల నెట్ వసూళ్లను సాధించి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. అంతకుముందు ఈ రికార్డు 'ధురంధర్ 2' పేరిట ఉండగా, ఆ సినిమా రెండో ఆదివారం రూ. 68 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇప్పుడు 'ధురంధర్ 2' సాధించిన ఆ రికార్డును రామాయణం బ్రేక్ చేసి రెండో ఆదివారం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
ఇది కూడా చదవండి: ఆ హీరోయిన్ నా ప్రాణం: విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్..వాళ్ళు అనుకున్నదే జరుగుతుందా!
దీపావళి సెలవులు ముగిసినప్పటికీ, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు క్యూ కడుతుండటంతో కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'జవాన్' (రూ. 643.87 కోట్లు), 'స్త్రీ 2' (రూ. 625.27 కోట్లు), 'ఛావా' (రూ. 601.57 కోట్లు), 'యానిమల్' (రూ. 556.36 కోట్లు) వంటి చిత్రాల లైఫ్‌టైమ్ కలెక్షన్ల రికార్డులను రామాయణం అవలీలగా దాటేసింది.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో రూ. 760.60 కోట్ల నెట్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం, రణ్‌బీర్ కపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఓవర్సీస్లోనూ రూ. 378.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, విదేశీ మార్కెట్లోనూ సత్తా చాటింది. హిందీ వెర్షన్ అత్యధికంగా 77.3% వాటాను అందిస్తుండగా, మిగతా సౌత్ భాషల వెర్షన్లు కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ విజువల్ వండర్ ఇంకెన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి.
మీకు నచ్చవచ్చు: తెలంగాణలో కల్కి 2 కి షాకింగ్ బిజినెస్: క్లోజ్ కూడా అయ్యింది!
మీకు నచ్చవచ్చు: అమితాబ్ బచ్చన్ ఆస్థి విషయంలో లేటెస్ట్ ట్విస్ట్!
[Ramayana , Dhurandhar 2, Ranbir Kapoor, Ranveer Singh, Bollywood]





