
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్టులపై కూడా ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ‘డ్రాగన్’ రెండు భాగాలుగా రానుందనే ప్రచారం, అనిల్ రావిపూడితో సినిమా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’.. ఇలా ఎన్టీఆర్ లైనప్‌లో వరుస భారీ ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమాల విడుదల తేదీల విషయంలో ఇప్పుడు కొత్త లెక్కలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ‘డ్రాగన్’ మొదటి భాగం 2027 జూన్‌లో, రెండో భాగం అదే ఏడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రెండో భాగం అనుకున్న సమయానికి విడుదల కాకపోతే మాత్రం ఎన్టీఆర్ తదుపరి సినిమాల షెడ్యూల్ మొత్తం మారిపోయే అవకాశం ఉందట.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ‘డ్రాగన్’ను రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మొదటి భాగాన్ని 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే స్పష్టం చేశారు. రెండో భాగాన్ని అదే ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌ను చూసి మిగతా స్టార్స్ మారతారా.?
తాజా సమాచారం ప్రకారం 2027 ఏప్రిల్ నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని.. అనిల్ రావిపూడి టీమ్‌కు ఎన్టీఆర్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం 2028 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట. ఒకవేళ ‘డ్రాగన్ 2’ డిసెంబర్ 2027లో విడుదల కాకపోతే.. అప్పుడు అనిల్ రావిపూడి సినిమాను సంక్రాంతి 2028కు తీసుకొచ్చి, ‘డ్రాగన్ 2’ను సమ్మర్‌కు మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ లైనప్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ తర్వాత మరోసారి కలిసి పనిచేయనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ‘డ్రాగన్’, అనిల్ రావిపూడి సినిమాల షెడ్యూల్స్ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై స్పష్టత లేదు. 2029లో విడుదల కావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చవచ్చు:
మరో సర్‌ప్రైజ్.. బోయపాటితో అల్లు అర్జున్ మూవీ అనౌన్స్‌మెంట్.!
ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, ప్రభాస్.. సందీప్ రెడ్డి అభిమానం చూపిస్తాడా.?
[Jr NTR Lineup, Dragon Movie, Dragon Part 2, Anil Ravipudi, God Of War]






