
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram POthineni)కి ఉన్న ఫ్యాన్ బేస్ తెలిసిందే. 18 ఏళ్ల అమ్మాయి తను పుట్టినప్పటి నుంచి 'ఫ్రీడ్రిచ్ అటాక్సియా' (Friedreich's Ataxia) అనే అత్యంత అరుదైన, తీవ్రమైన నరాల బలహీనత వ్యాధితో పోరాడుతోంది. ఈ వ్యాధి కారణంగా కండరాల నియంత్రణ కోల్పోవడం, నడవడానికి మరియు రోజువారీ పనులు చేసుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి రామ్ పోతినేనికి వీరాభిమానిగా మారింది. తన జీవితంలో ఒక్కసారైనా రామ్ పోతినేనిని స్వయంగా కలవాలని, ఆయనతో మాట్లాడాలని ఎప్పటి నుంచో కలలు కంటూ వస్తుంది.
ఈ విషయం తెలుసుకున్న రామ్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లారు. దీంతో రామ్ హఠాత్తుగా తన కళ్ల ముందుకు వచ్చేసరికి ఆ అమ్మాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ అమ్మాయి పక్కన కూర్చుని ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. రామ్ ప్రస్తుతం తన కొత్త చిత్రంతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు కూడా తనే కావడంతో ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో సదరు మూవీపై క్యూరియాసిటీ ఏర్పడింది.
Also read: Poonam kaur: బావ ఫోటో పెట్టుకున్నావ్ ఏంటి.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి పూనమ్ కౌర్ ప్రశ్న






