Home

»

Latest News

Ram Pothineni: డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న రామ్ పోతినేని.. సైన్స్ ఫిక్షన్ సినిమాతో సంచలనం!

May 12, 2026

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) కెరీర్‌లో ఒక భారీ మలుపు తీసుకోబోతున్నారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్, ఇప్పుడు మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు. తన తదుపరి చిత్రంతో ఆయన దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నట్లు సమాచారం. వరుస పరాజయాల నేపథ్యంలో, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి రామ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రామ్ అదిరిపోయే స్క్రిప్ట్ ను రెడీ చేసుకొని, ఒక నూతన దర్శకుడితో సినిమా చేయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు తానే దర్శకత్వం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. హీరోగా, డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించబోతున్నారట. తన అన్న కృష్ణ చైతన్య పోతినేనితో కలిసి సొంత బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇలా ఒకే సినిమాకు నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా బాధ్యతలు చేపట్టి.. రామ్ సంచలనానికి సిద్ధమవుతున్నారు. 

ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా అని సమాచారం. ఈ సినిమా కోసం 'ది లోన్ వోల్ఫ్' (The Lone Wolf) అనే టైటిల్‌ను ఇప్పటికే రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. సామ్ సి.ఎస్ (Sam CS) ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఉంది. మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

గత చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, రామ్ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. మరి దర్శకుడిగా విజయం సాధించి, తనలోని నటుడిని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తారేమో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com