Home

»

Latest News

రామ్‌కి ధోనీ దెబ్బ‌

Oct 4, 2016 3:23PM

ఈవారం రామ్ న‌టించి హైప‌ర్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. అయితే అదే రోజున బాలీవుడ్ సినిమా ధోనీ కూడా విడుద‌లైంది. నిజానికి బాలీవుడ్ సినిమాలు తెలుగు చిత్ర‌సీమ‌పై ప్ర‌భావం చూపించ‌డం అంతంత మాత్ర‌మే. పైగా ఇది బయోపిక్‌. సినిమాలో స్టార్లు ఎవ‌రూ లేరు. అందుకే ధోనీని హైప‌ర్ టీమ్ లైట్‌గా తీసుకొంది. ధోనిని త‌క్కువ అంచ‌నా వేసింది. అయితే ధోనీ ప్ర‌భావంతో ఇప్పుడు హైప‌ర్ గిల‌గిల‌లాడిపోతోంది. హైప‌ర్‌కి వ‌సూళ్లు బాగానే ఉన్నా.. ధోనీ వ‌ల్ల రామ్ సినిమాకి వ‌సూళ్లు బాగా త‌గ్గాయ‌న్న‌ది టాలీవుడ్ టాక్‌.

ముఖ్యంగా మ‌ల్టీప్లెక్స్‌లో ధోనీ విశ్వ‌రూపం చూపిస్తున్నాడు. తెలుగు వెర్ష‌న్‌కీ, హిందీ వెర్ష‌న్‌కీ డిమాండ్ బాగుంది. మ‌ల్టీప్లెక్స్‌ల‌లో ధోనీ హౌస్‌ఫుల్ అయ్యాకే... హైప‌ర్ హాళ్లు నిండుతున్నాయి. దాన్ని బ‌ట్టి బాలీవుడ్ సినిమా ప్ర‌భావం రామ్‌పై ఎంత‌గా ప‌డిందో అర్ధ‌మ‌వుతోంది. ''ధోనీ సినిమాని రామ్ త‌క్కువ అంచ‌నా వేశాడు. డ‌బ్బింగ్ సినిమానే అనే దృష్టితో చూశాడు. దాంతో వ‌సూళ్ల‌కు గండి ప‌డింది'' అంటూ విశ్లేష‌కులు తేలుస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియ‌న్స్ హైప‌ర్ కంటే.. ధోనీ కే ఓటేయ్య‌డంతో హైప‌ర్‌కి దెబ్బ ప‌డిన‌ట్టైంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com