Home

»

Latest News

సమంతా, చైతూ విషయం అతనికి ముందే తెలుసా..?

Oct 4, 2016 3:04PM

ప్రజంట్ టాలీవుడ్‌లో హాట్ న్యూస్ ఏమైనా ఉంది అంటే అది సమంతా, నాగచైతన్యల పెళ్లి విషయమే. వీరి గురించి ప్రతిరోజు ఏదో ఒక ఆసక్తికర విషయం వెలుగు చూస్తూనే ఉంది. మొన్నామధ్య సమంత మత మార్పిడి అంటూ పెద్ద దుమారం రేగడం దానికి ఇద్దరూ తెరదించడం చకచకా జరిగిపోయింది. తాజాగా మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే వీరిద్దరూ లవ్ చేసుకుంటున్న సంగతి మొదట ఒక హీరోకి తెలుసుట. అతను ఎవరో కాదు..చైతన్య బావ, టాలీవుడ్ భల్లాలదేవుడు రానా. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ప్రేమమ్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా తమ పెళ్లికి సంబంధించిన మరికొన్ని విషయాలు చెప్పాడు చైతూ.

దానిలో భాగంగానే తమ ప్రేమ విషయం రానా దాకా వెళ్లిన సంగతి చెప్పుకొచ్చాడు. పెళ్లయితే సమంత సినిమాలు ఆపేస్తుందా..? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో హీరోనయ్యానని..కానీ సమంత తన సొంత కష్టంతో నెంబర్‌వన్ హీరోయిన్ రేంజ్‌కి వచ్చిందన్నారు..అలాంటి వ్యక్తిని సడెన్‌గా సినిమాలు ఆపేయమని చెప్పడం కరెక్ట్ కాదన్నాడు. వ్యక్తిగత జీవితం వేరు..వృత్తిగత జీవితం వేరని అందువల్ల పెళ్లయినా సమంత సినిమాల్లో నటిస్తుందని స్పష్టం చేశాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com