Home

»

Latest News

వర్మ జీవితంపై పరిశోధన..

Nov 4, 2016 3:50PM

తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేసిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఎవరి దగ్గరా శిష్యరికం చేయకుండానే సినిమాలు తీసి సంచలన దర్శకుడిగా పేరుపొందారు వర్మ. నాగార్జునతో ఆయన తీసిన శివ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్. టాలీవుడ్ ప్రస్థానాన్ని చెప్పాల్సి వస్తే శివకు ముందు..శివకు తర్వాత అన్నంత ముద్ర పడిందంటే రామూ స్టామినా ఎంటో తెలుసుకోవచ్చు. మనసులో ఏమున్నా ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద చెప్పే వ్యక్తిత్వం ఆయనది. అందుకే వర్మ మాట్లాడినా..సినిమా తీసినా అదోక సెన్షేషన్. అలాంటి రామ్‌గోపాల్ వర్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదు. దేశవ్యాప్తంగా ఆయన్న అభిమానించే వారు కోట్లలో ఉన్నారు.

ఇప్పటీకే వర్మ తన గురించి తానే "నా ఇష్టం" అనే పుస్తకాన్ని రాసుకున్నారు. పాటల రచయిత సిరాశ్రీ "వోడ్కా విత్ వర్మ" అనే పుస్తకాన్ని వర్మ పైనే రాశాడు. తాజాగా గన్స్ అండ్ థైస్ అంటూ మరో బుక్ కూడా రిలీజ్ చేశాడు రామూ. తాజాగా విశాఖ ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన ప్రవీణ్ యజ్జాల అనే పీహెచ్‌డీ విద్యార్థి వర్మ జీవితంపై పరిశోధన చేశాడు. ఇప్పుడా ఆ రీసెర్చ్ రిపోర్టు ఓ బుక్‌గా కూడా విడుదల కానుంది. ఆ వార్త ఏయూ క్యాంపస్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. ఎంతైనా వర్మ న్యూస్ కదా..?

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com