Home

»

Latest News

త్వరలో ట్విట్టర్‌ను శాసించనున్న డిక్టేటర్..

Nov 4, 2016 4:07PM

భారతదేశంలో సినిమా ఒక మతమైతే..సినీ తారలు వేల్పులు. అంతగా అభిమానిస్తారు ఇక్కడి అభిమానులు..జీవితంలో ఒక్కసారైన తమ అభిమాన నటి/నటుడిని చూడాలనుకుంటారు ఫ్యాన్స్. ఇదివరకటి రోజుల్లో సినీ తారలను చూడాలంటే చెన్నైకో..ముంబైకో..హైదరాబాద్‌కో వెళ్లాల్సి వచ్చేది. కానీ సోషల్ మీడియా రాకతో ఈ తిప్పలు పోయాయి. ట్విట్టర్..ఫేస్‌బుక్..ఇన్‌స్టాగ్రమ్ ఇలా సోషల్ మాధ్యమాల్లో తారలు తమ అభిమానులకు టచ్‌లోనే ఉంటున్నారు. వీటిలో తమ సినిమాల ఆప్‌డేట్స్‌తో పాటు..వ్యక్తిగత సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు వెండితెర వేల్పులు.

యంగ్‌ హీరోలు ఈ విషయంలో జెట్ స్పీడుతో ఉండగా..సీనియర్లు వారి దారిలో నడుస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా చేరనున్నారు. ఇప్పటికే బాలయ్యకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది. ఆ దారిలోనే ట్విట్టర్ ఖాతాను కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నారట బాలకృష్ణ. శాతకర్ణి ప్రమోషన్ కోసం ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఆ సినిమా దర్శక, నిర్మాతలు కోరడంతో సానుకూలంగా స్పందించారట బాలయ్య. సో ఇక ట్విట్టర్‌ని డిక్టేట్ చేయడానికి డిక్టేటర్ రంగంలోకి దిగుతున్నారన్నమాట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com