
దశాబ్దాల క్రితమే తెలుగు సినిమా ఖ్యాతిని బాలీవుడ్ పై నిలబెట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కాకపోతే గత కొంత కాలంగా తన రేంజ్ కి తగ్గట్టుగా సినిమాలు తెరకెక్కించడం లేదనే అపవాదుని అభిమానుల నుంచి భారీగానే మూటగట్టుకుంటూ వస్తున్నాడు. పైగా డిజాస్టర్స్ తో ట్రావెల్ చేస్తున్నాడు.
అలాంటి వర్మ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో 'రామాయణ’మూవీ గురించి మాట్లాడుతు 'రామాయణని కేవలం ఒక సాధారణ భక్తిరస చిత్రంగా చూడలేం. అది ఒక అద్భుతమైన ‘భక్తి శక్తి’. ఈ చిత్రాన్ని రూపొందించడానికి చిత్ర యూనిట్ పడిన అపారమైన శ్రమతో పోలిస్తే, వచ్చే విమర్శలు చాలా చిన్నవి. ఎలాంటి విమర్శలని కూడా చిత్ర బృందం అసలు పట్టించుకోవద్దని ఆయన సూచించారు.
చిత్రంలో ప్రధాన పాత్రధారుల నటనపై వర్మ ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. రాముడిగా రణ్బీర్ కపూర్, రావణుడిగా యశ్ అభినయం ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. ముఖ్యంగా సీతాదేవి అపహరణ తర్వాత ఖాళీగా ఉన్న ఆశ్రమంలో రాముడు ఒంటరిగా నిలబడే సన్నివేశంలో రణ్బీర్ కనబరిచిన నటన మరియు అందులోని దుఃఖాన్ని కెమెరా బంధించిన తీరు అద్భుతమని తెలిపారు.
.webp)
ఇది కూడా చదవండి: మళ్ళీ వస్తాయా?: ఆ అద్భుతమైన మ్యూజికల్ హిట్ చిత్రాలు!
ఇందులో రాముడి పాత్రను కేవలం కథకు అతీతంగా ఉండే దేవుడిలా కాకుండా, ప్రపంచం ముగియబోతోందని తెలిసినా సరే ఎంతో ధైర్యంగా ముందుకు సాగిన ఒక మానవుడిగా అద్భుతంగా చూపించారని వర్మ అన్నారు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాకి నూతనోత్సాహాన్ని తీసుకొస్తున్నాయి.
ఎందుకంటే వర్మ ఆ మాటలు మాట్లాడింది. పైగా వర్మ ట్రాక్ రికార్డు కూడా తెలిసిందే. అందుకే ఆ మాటలు సోషల్ మీడియాకి నూతనోత్సాహాన్ని తీసుకొస్తున్నాయి.
.webp)
ప్రెజెంట్ రామాయణ నాలుగురోజులనే 490 కోట్లని సాధించి సెల్యులాయిడ్ వద్ద రాముడి కట్ అవుట్ కి ఉన్న రేంజ్ ని చాటి చెప్పింది.
మీకు నచ్చవచ్చు: గరివిడి లక్ష్మి ఓటిటి డేట్ వచ్చేసింది. ఆ రోజు పండుగే!
మీకు నచ్చవచ్చు: రామాయణ మూవీ రివ్యూ!
[Ram Gopal Varma About Ramayana Part 1, Rgv About Ramayana Movie, Varma About Ramayana, Ramayaa collections, Ranbir Kapoor, Yash, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]






