Home

»

Latest News

అలియాస్ రుక్మిణి: మూడు నెలల్లో సినిమా పూర్తి.. మామూలు స్పీడ్ కాదు.!

Nov 9, 2026 2:12PM

టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఎక్కువ సమయం తీసుకుంటుంటే.. మరికొన్ని మాత్రం అనుకున్న ప్లాన్ ప్రకారం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్నాయి. తాజాగా ‘అలియాస్ రుక్మిణి’ సినిమా కూడా ఈ జాబితాలో చేరింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఆగస్టు 3న ఈ మూవీ లాంచ్ జరిగింది. నవంబర్ 9న షూటింగ్‌ పూర్తయినట్లు ప్రకటించారు. అంటే మూడు నెలల్లోనే సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం, పూర్తి కావడం జరిగిపోయాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

ఇటీవల చాలా సినిమాల షూటింగ్స్ ప్లాన్ చేసుకున్న విధంగా జరగక.. విడుదల తేదీలు మారుతూ వస్తున్నాయి. ఆ విషయంలో 'అలియాస్ రుక్మిణి' టీంని మెచ్చుకోవచ్చు. బౌండ్ స్క్రిప్ట్, ప్రోపర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉంటేనే ఇలా మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేయడం సాధ్యమవుతుంది. 

అలియాస్ రుక్మిణిలో నితిన్, ఆఫియా సయ్యద్ జంటగా నటిస్తున్నారు. న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: బాలయ్య నన్ను ‘ఏరా పెద్దిరెడ్డి’ అని పిలుస్తారు.. ‘దాదా’ సినిమా ఎలా ఉండబోతుందంటే.?

ఈ సినిమాలో కృష్ణ అనే రచయిత పాత్రలో నితిన్ కనిపించనున్నారు. స్కూల్ టీచర్‌ రుక్మిణి పాత్రలో ఆఫియా సయ్యద్ నటిస్తున్నారు. కృష్ణ, రుక్మిణి మధ్య క్యూట్ లవ్ స్టోరీగా ఈ సినిమా అలరించనుంది.

నితిన్‌ కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘అలియాస్ రుక్మిణి’ ఆయనకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చవచ్చు:
బాలయ్యతో భీష్మ.. 17 ఏళ్ళ క్రితం ప్లాన్ చేసిన క్రేజీ మూవీ.. ఎందుకు ఆగిపోయింది.?
ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తుడు.. ‘కర్తవ్యం’లో విలన్‌గా మెప్పించిన ఈ నిర్మాత ఎవరో తెలుసా.?

 

 

 

[Alias Rukmini Shoot Wrapped, Alias Rukmini Release Date, Alias Rukmini December 4 Release, Alias Rukmini Movie, Nani, Nithiin, Aafiya Sayed, Murali Kanth Devasoth, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com