Home

»

Latest News

వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్

Mar 11, 2011 1:50PM

ram charan stills, ram charan images, ram charan pics, ram charan photos, ram charan wall papersవినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించటానికి అంగీకరించారని సమాచారం. ఇప్పటికే సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక చిత్రంలో నటించటానికి అంగీకరించారు. సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించబోయే ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ నటించబోయే ఈ చిత్రానికి "రచ్చ" అనే పేరుని నిర్ణయించారు.

ఈ చిత్రం తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించటానికి సన్నాహాలు జరుగుతున్నాయని వినపడుతోంది. తండ్రి మెగాస్టార్ తో "ఠాగూర్" వంటి బ్లాక్ బస్టర్ హిట్టిచ్చిన వినాయక్ కొడుకు రామ్ చరణ్ కి ఇంకెంత పెద్ద హిట్టిస్తాడోనని సినీ జనం అనుకుంటున్నారు. రామ్ చరణ్, వినాయక్ కాంబినేషన్ లో రాబోయే ఈ చిత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల అంచనాలను అందుకుంటుందని చెప్పవచ్చు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com