Home

»

Latest News

Ram Charan: పొలిటికల్ ఎంట్రీపై రామ్ చరణ్ క్లారిటీ.. భవిష్యత్తులో సీఎం అవుతారా?

May 22, 2026

- రాజకీయాల్లోకి రామ్ చరణ్..? 
- సీఎం కావాలంటున్న ఫ్యాన్స్!
- పాలిటిక్స్ పై చరణ్ బోల్డ్ స్టేట్మెంట్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన అప్‌కమింగ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) ప్రమోషన్లలో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. రామ్ చరణ్ తన రాజకీయ అరంగేట్రం (Political Entry) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"మీ అభిమానులు మిమ్మల్ని సీఎం (CM) గా చూడాలనుకుంటున్నారు.. భవిష్యత్తులో పాలిటిక్స్‌లోకి వెళ్తారా?" అని యాంకర్ ప్రశ్నించగా.. చరణ్ నవ్వుతూ స్పందించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అస్సలు లేదని ఆయన తేల్చి చెప్పారు. తనకు కేవలం సినిమా రంగంలోనే నంబర్ 1 అనిపించుకోవాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేయడం తనకు ఇష్టం లేదని, ప్రస్తుతానికి తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉందని చరణ్ స్పష్టం చేశారు.

కాగా, మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అలాగే కేంద్ర మంత్రిగా పని చేశారు. ఇక జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

ఈ క్రమంలోనే తండ్రి, బాబాయ్ ల బాటలో.. రామ్ చరణ్ కూడా పాలిటిక్స్ లోకి రావాలని అభిమానులు ఆశపడుతున్నారు. అయితే చరణ్ మాత్రం అసలు ఆ ఆలోచనే లేదు అంటున్నారు. మరి చరణ్ ఇదే మాట మీద ఉండిపోతారా? లేక అభిమానుల కోరిక మేరకు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా? అనేది చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com