
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద అప్పుడే తన విశ్వరూపాన్ని చూపించడం ప్రారంభించింది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమాపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో తాజా అమెరికా ప్రీసేల్స్ లెక్కలు నిరూపిస్తున్నాయి.
ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ఇంకా విడుదల కానప్పటికీ.. కేవలం రామ్ చరణ్ స్టార్డం, బుచ్చిబాబు మార్క్ సబ్జెక్ట్ పై ఉన్న నమ్మకంతో నార్త్ అమెరికాలో ప్రీమియర్ టికెట్ సేల్స్ సునామీ సృష్టిస్తున్నాయి. తాజా ట్రేడ్ నివేదికల ప్రకారం, నార్త్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ‘పెద్ది’ చిత్రం అప్పుడే 341 K డాలర్ల (సుమారు రూ. 2.80 కోట్లు) మార్కును దాటి సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతోంది.
యూఎస్ఏ మార్కెట్‌లో కేవలం 457 లొకేషన్ల నుండే ఏకంగా 10,864 టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. దీని ద్వారా 311,539 డాలర్ల వసూళ్లు కేవలం యూఎస్ఏ నుండే రాగా, మిగిలినవి ఇతర రీజియన్స్ నుండి నమోదయ్యాయి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అత్యధికంగా 72,000 డాలర్లకు పైగా కలెక్షన్స్ రాగా, కాలిఫోర్నియాలో 27,000 డాలర్లు, నార్త్ కరోలినాలో 18,000 డాలర్ల వసూళ్లతో మెగా పవర్ స్టార్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ థియేటర్ చైన్ సినీమార్క్ (Cinemark) లోనే అత్యధికంగా 214,000 డాలర్ల టికెట్ సేల్స్ జరగడం గమనార్హం.
రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ సాధించిన పూర్తి ప్రీమియర్ కలెక్షన్లలో ‘పెద్ది’ చిత్రం అప్పుడే 44 శాతం వసూళ్లను సాధించిందని, అదీ కేవలం ప్రమోషన్స్ ప్రారంభ దశలోనే జరగడం చరణ్ గ్లోబల్ స్టామినాకు నిదర్శనమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.
1980ల నాటి పల్లెటూరి నేపథ్యంతో సాగే ఒక ప్యూర్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సన అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ఒక గ్రామీణ యువకుడిగా, క్రీడల ద్వారా తన సమాజాన్ని ఎలా ఏకం చేశాడనే ఆసక్తికరమైన స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సాగనుంది. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
ఈరోజు (మే 18) సాయంత్రం పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ ప్రీసేల్స్ లెక్కలు మిలియన్ డాలర్ల వైపు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.





