Home

»

Latest News

Peddi: బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ దండయాత్ర.. వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్ తెలిస్తే షాక్!

Jun 3, 2026 11:22AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడానికి సర్వం సిద్ధమైంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలోకి రాబోతోంది. రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో మరియు అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న సినిమా కావడంతో మెగా అభిమానులతో పాటు యావత్ సినీ ప్రపంచం ఈ సినిమా రిలీజ్ కోసం వేల కళ్లతో ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు అందిన ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ మరియు థియేట్రికల్ రన్ అంకెలు ఇండస్ట్రీ వర్గాల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.

గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన 'పెద్ది' చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ పరంగా భారీ వాల్యూను సొంతం చేసుకుంది. ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ దాదాపు రూ. 220 కోట్లకు క్లోజ్ అయింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఈ చిత్రం ఏకంగా రూ. 135 కోట్లకు పైగా భారీ థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుంది. చరణ్ మాస్ ఇమేజ్, బుచ్చిబాబు కంటెంట్ పై ఉన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రం కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు.

ఈ భారీ బిజినెస్ టార్గెట్‌ను అందుకోవడానికి మేకర్స్ 'పెద్ది' చిత్రాన్ని గ్లోబల్ వైడ్‌గా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 1500 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా స్క్రీన్స్ కౌంట్ 2700 కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4000 స్క్రీన్స్ లో విడుదలకు ప్లాన్ చేశారని సమాచారం.

చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో టికెట్ ధరల పెంపునకు కూడా ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున టికెట్ ధరలను పెంచుతూ, రోజుకు ఐదు ప్రదర్శనలు (5 Shows) వేసుకోవడానికి 10 రోజుల పాటు అనుమతులు లభించాయి. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే రూ. 600 టికెట్ ధరతో ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com