
పెద్ది(Peddi)తో దర్శకుడు బుచ్చిబాబు మరో సారి తన సత్తా చాటడానికి సిద్దమయ్యాడు. తన మొదటి మూవీ ఉప్పెన అత్యంత సెన్సిటివ్ సబ్జెట్ తో తెరకెక్కింది. కానీ బుచ్చిబాబు చాలా తెలివిగా తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఉప్పెన ని చూస్తున్నంత సేపు తొలి చిత్రమని ఎవరు అనుకోరు. అంతలా తన టేకింగ్ తో మెస్మరైజ్ చేసాడు. కానీ టాలీవుడ్‌లో ఎప్పటినుంచో ఒక బలమైన సెంటిమెంట్ ఇండస్ట్రీ వర్గాలని, ప్రేక్షకులని భయపెడుతూనే ఉంది. మొదటి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి, బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన దర్శకులకి తమ రెండవ సినిమా దగ్గరకి వచ్చేసరికి ఫ్లాప్ ని అందుకుంటారనే నమ్మకం ఉంది. ఈ సెకండ్ మూవీ సెంటిమెంట్ ఎంతో మంది టాలెంటెడ్ దర్శకుల కెరీర్‌పై ప్రభావం చూపించింది. ఇప్పుడు సరిగ్గా ఇదే సెంటిమెంట్ ముంగిట నిలబడ్డారు బుచ్చిబాబు.
ఉప్పెనతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన బుచ్చిబాబు, ఇప్పుడు తన రెండవ చిత్రానికి సంబంధించి ట్రేడ్ సర్కిల్ లో వినపడే సెంటిమెంట్‌ని బద్దలు కొడతారా లేదా అన్నది సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు సైతం తమ రెండవ సినిమాతో విజయం సాధించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయితే, చాలా మంది కొత్త దర్శకులు మొదటి సినిమాతో ఉన్నపళంగా స్టార్ స్టేటస్ తెచ్చుకుని, రెండవ సినిమా విషయంలో కథపై పట్టు కోల్పోయి బోల్తా పడిన దాఖలాలు 80 శాతానికి పైగా ఉన్నాయి. కానీ బుచ్చిబాబు మాత్రం ఈ సెంటిమెంట్‌ని ఏమాత్రం లెక్కచేయకుండా, ఏకంగా 350 కోట్ల భారీ బడ్జెట్‌తో చరణ్‌ని డైరెక్ట్ చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. పైగా పెద్ది కోసం ఐదు సంవత్సరాలు వెయిట్ చేసాడు. ట్రైలర్ తో పాటు ప్రచార చిత్రాలైతే ఒక రేంజ్ లో ఉన్నాయి.
Also read: Peddi: పెద్ది ఫస్ట్ డే కొట్టబోయే కలెక్షన్స్ ఇవేనా!
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చరణ్ తో పాటు, మిగతా నటీనటులు, నిర్మాతలు బుచ్చిబాబు గురించి చెప్పిన దాన్ని బట్టి చూస్తే రెండవ సినిమా గండాన్ని దాటతాడనే అనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడనున్నాయి. ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం, 'పెద్ది' మొదటి రోజు ప్రీమియర్స్ తో కలుపుకొని వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సుమారు 100 కోట్ల గ్రాస్ ని రాబట్టే అవకాశం ఉందని చెప్తున్నారు.





.webp)
