Home

»

Latest News

Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’లో అదిరిపోయే ట్విస్ట్.. అసలు కథ ఇదే!

Mar 29, 2026

  • ‘పెద్ది’ క్రేజీ అప్‌డేట్ 
  • మెగా పవర్ స్టార్ డ్యూయల్ రోల్
  • తండ్రి కొడుకులుగా చరణ్ 
  • బుచ్చిబాబు ప్లాన్ మామూలుగా లేదుగా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi). ఇటీవల విడుదలైన గ్లింప్స్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ఈ సినిమా కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారని తెలియడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.

ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ తండ్రి మరియు కొడుకుగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడట. ఒక పాత్ర 1980ల నాటి పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పహిల్వాన్ కాగా, రెండో పాత్ర ప్రస్తుత కాలానికి సంబంధించిన యువకుడిగా ఉంటుందని సమాచారం. గతంలో చరణ్ 'మగధీర', 'నాయక్' వంటి చిత్రాల్లో డ్యూయల్ రోల్స్ చేసి మెప్పించాడు.

దర్శకుడు బుచ్చిబాబు సానా 'ఉప్పెన' చిత్రంతోనే తనలోని ఎమోషనల్ రైటింగ్‌ను నిరూపించుకున్నాడు. ఇప్పుడు 'పెద్ది' చిత్రంలో కూడా తండ్రి-కొడుకుల మధ్య ఉండే ఒక బలమైన సెంటిమెంట్‌ను, క్రీడల నేపథ్యంలో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర మట్టి వాసన ఉట్టిపడేలా సాగే ఈ కథలో, ఒక పాత్ర ఊర మాస్ గెటప్‌లో ఉంటుందని.. చరణ్ బాడీ లాంగ్వేజ్, మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడనే వార్త బయటకు రాగానే మెగా అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే చరణ్ నుండి మాస్ జాతర గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్టులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో మెరవనున్నాడు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com