Home

»

Latest News

Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ ఇంట తీవ్ర విషాదం!

Mar 30, 2026

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత (86) ఈరోజు (సోమవారం) ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె, బెంగళూరులోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

సువర్ణలత భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం బెంగళూరులో జరగనున్నాయి.

ప్రకాశ్ రాజ్ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని పలు సందర్భాల్లో పంచుకున్నారు. ఆమె మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ మరియు శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com