.webp)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi). గ్లోబల్ వైడ్‌గా అత్యంత భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా సృష్టిస్తున్న హంగామా ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్‌గా మారాయి. ప్రీమియర్ షోల టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్ మార్కెట్ స్టామినా ఏంటో మరోసారి స్పష్టమైంది.
ప్రముఖ ఓవర్సీస్ పంపిణీ సంస్థ 'ప్రత్యంగిరా సినిమాస్' ఈ భారీ చిత్రాన్ని నార్త్ అమెరికా వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి జూన్ 3న యూఎస్‌లో గ్రాండ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. అయితే ఇంకా థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల కాకముందే, కేవలం రామ్ చరణ్ క్రేజ్ ఆధారంగానే నార్త్ అమెరికా ప్రీమియర్స్ కోసం ఇప్పటికే 10,000కు పైగా టిక్కెట్లు అమ్ముడవడం విశేషం. ఈ వేగం చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రీ-సేల్స్ వసూళ్లు సరికొత్త మైలురాళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.
విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్‌ఫుల్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న 'పెద్ది' చిత్రంలో రామ్ చరణ్ రగ్గడ్ లుక్, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ తారాగణం, సాంకేతిక నిపుణుల కలయిక ఓవర్సీస్ ప్రేక్షకులలో సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది.
యూఎస్‌ఏ, కెనడా మార్కెట్లలో ఇప్పటివరకు ఉన్న పాత రికార్డులను తిరగరాయడమే లక్ష్యంగా 'పెద్ది' బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించనుంది. నార్త్ అమెరికా వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 3న పడబోయే ఓవర్సీస్ ప్రీమియర్ షోల నుంచే 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.





.webp)
