.webp)
అందరం పుట్టింది.. బతుకుతుంది.. ఎదుగుతుంది తెలుగు సినిమా వలనే అనే విషయం తెలిసి కూడా కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ మధ్య పర్శంటేజ్ విషయంలో ఇష్యూ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎవరి వర్షన్ వాళ్ళది. విచిత్రం ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నా కూడా కరెక్టే కదా వాళ్ళు మాట్లాడేది అనిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే వివాదం మరింత ముదరడంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రంగంలోకి దిగింది. ఇరు వర్గాల మధ్య సమన్వయం కుదర్చడానికి, సమస్యకి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి పదిహేను మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రెండు నెలల్లో పూర్తి నివేదిక ఇవ్వనుంది.
ఈ మొత్తం వివాదంలో మరో ఆసక్తికరమైన కీలకమైన మలుపు చోటుచేసుకుంది. పర్సంటేజ్ సిస్టమ్ వివాదం ఎలా ఉన్నప్పటికీ, ఇప్పటికే భారీ అంచనాలతో, వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సుమారు పదిహేడు క్రేజీ ప్రాజెక్టులకి ఈ వివాదం నుండి ఊరట లభించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ 17 సినిమాల జాబితాలో పెద్ది, డ్రాగన్ , విశ్వంభర, హనుమన్ 2 , కల్కి 2', స్పిరిట్', వారణాసి, ది ప్యారడైజ్, రాకా, ఎన్ బి కె 111 , మెగా 158 ,రామ్ చరణ్, సుకుమార్ కాంబో మూవీ, ఏ కె 47 ,నాని, సుజిత్ కాంబో, వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో, అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీ ఇలా సుమారు 17 చిత్రాలకి పర్శంటేజ్ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది.
Also read: Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్ బిల్లు వైరల్.. వాటర్ బాటిల్ రేటు చూస్తే షాకవుతారు
ఈ పెద్ద సినిమాల థియేట్రికల్ బిజినెస్ మరియు అడ్వాన్స్‌లు ఇప్పటికే పాత పద్ధతిలోనే జరిగాయని, కాబట్టి వీటిని ప్రస్తుత వివాదం నుండి పక్కన పెట్టాలని ఇరు వర్గాలు ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఈ మినహాయింపు జాబితా వల్ల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల విడుదలకి ఎలాంటి ఆటంకం కలగదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా థియేటర్ల మనుగడ ముఖ్యం, అలాగే నిర్మాతల పెట్టుబడి సేఫ్ అవ్వడం కూడా అంతే ముఖ్యం. ఈ ఫ్యామిలీ సమస్యని టాలీవుడ్ పెద్దలు త్వరలోనే సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తారని ప్రేక్షకులు మరియు సినిమా ప్రేమికులు ఆశిస్తున్నారు.




.webp)

