Home

»

Latest News

Peddi: రామ్ చరణ్ 'పెద్ది' అడ్వాన్స్ బుకింగ్స్ విధ్వంసం.. అప్పుడే అన్ని కోట్లా?

Jun 2, 2026 9:07AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం, థియేటర్లలోకి రాకముందే ఇండస్ట్రీలో, ప్రేక్షకులలో మునుపెన్నడూ లేని విధంగా భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. 

1980ల నాటి పల్లెటూరి నేపథ్యంతో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక పవర్‌ఫుల్ పల్లెటూరి యువకుడిగా, తన ఊరి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం పోరాడే పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి విభిన్న క్రీడల ద్వారా తన వారి కోసం పోరాడే ఒక అద్భుతమైన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఎలిమెంట్‌ను దర్శకుడు బుచ్చిబాబు సన ఈ కథకు జోడించారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని హై-ఎనర్జీ సాంగ్ వీడియోస్ నెట్టింట ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన సాంగ్స్ ప్రతి ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియా మొత్తం పెద్ది సాంగ్స్ తో మారుమోగిపోతోంది.

రీసెంట్ గా విజయవాడలో జరిగిన 'పెద్ది' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఒక అద్భుతమైన జాతరను తలపించింది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసందోహం మధ్య జరిగిన ఏఆర్ రెహమాన్ లైవ్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. అభిమానుల ఎమోషనల్ కేకలు, చప్పట్లతో విజయవాడ ప్రాంగణం మొత్తం మార్మోగిపోయింది.

బిజినెస్ మరియు అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఇప్పటిదాకా ఏకంగా 20 నుండి 23 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. కేవలం భారతదేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా రామ్ చరణ్ క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా ప్రీమియర్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం ఇప్పటికే 850,000 డాలర్ల మార్కును దాటి ఒక సరికొత్త రికార్డు దిశగా దూసుకుపోతోంది. 

ఈ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా రోజుకు 5 ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వడమే కాకుండా, టికెట్ ధరల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కలెక్షన్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దాదాపు రెండున్నరేళ్ల పాటు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సినిమా రూపంలో దక్కబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్ 4న థియేటర్లలో మెగా మాస్ విధ్వంసం చూడటానికి యావత్ సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తోంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com