Home

»

Latest News

చ‌ర‌ణ్‌కి కాజ‌ల్ అంటే ఎందుకింత ఇది...?

Aug 4, 2016 1:09PM

చిరంజీవి 150వ సినిమాలో కథానాయిక‌గా కాజ‌ల్ వ‌చ్చి చేరింది. దాంతో హీరోయిన్ స‌మ‌స్య తీరిన‌ట్టైంది. కాజ‌ల్ ఎంట్రీ వెనుక చాలా త‌తంగ‌మే న‌డిచింద‌ట‌. కాజ‌ల్ చిరు టీమ్ తో జాయిన్ అవ్వ‌డానికి కార‌ణం.. రామ్‌చ‌ర‌ణ్ అని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. కాజ‌ల్‌ని తీసుకోవాల్సిందే అని రామ్ చ‌ర‌ణ్ ప‌ట్టుప‌ట్ట‌డం వ‌ల్లే... మెగా సినిమాలో కాజ‌ల్‌కి ఛాన్స్ ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. రామ్ చ‌ర‌ణ్ - కాజ‌ల్‌ది హిట్ పెయిర్‌. మ‌గ‌ధీర‌, ఎవ‌డు, గోవిందుడు అంద‌రి వాడేలే సినిమాలో క‌ల‌సి న‌టించారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య మంచి రాపో ఉంది. ''నా బెస్ట్ కో స్టార్ కాజ‌లే'' అని చ‌ర‌ణ్ కూడా చాలా సంద‌ర్భాల్లో చెప్పాడు. కాజ‌ల్ కూడా ఇదే మాట అంటుంటుంది. అదీ కాక‌.. వీళ్లిద్ద‌రి మ‌ధ్యా ప‌ర్స‌న‌ల్‌గా రాపో చాలా బాగుంటుంద‌ని....

అందుకోస‌మే డాడీ సినిమాలో కాజ‌ల్‌ని తీసుకోవాల్సిందే అంటూ చ‌ర‌ణ్ ప‌ట్టుప‌ట్టాడ‌ని తెలుస్తోంది. కాజ‌ల్ రాక‌... అటు వినాయ‌క్‌కి గానీ, ఇటు చిరంజీవికి గానీ ఇష్టం లేద‌ట‌. కేవ‌లం చ‌ర‌ణ్ బ‌ల‌వంతంపైనే కాజ‌ల్‌కి తీసుకొన్నార‌ట‌. అదీగాక‌.. ఈ సినిమా కోసం కాజ‌ల్ భారీ పారితోషికం కూడా డిమాండ్ చేసింది. కాజ‌ల్ అడిగినంత ఇవ్వ‌డానికి చ‌ర‌ణ్ కూడా ఓకే అన్నాడు. ఈ సినిమాకి చ‌ర‌ణే నిర్మాత క‌దా?  కాజ‌ల్ కి ఎంత ఇవ్వాల‌న్న‌ది చ‌ర‌ణ్ ఇష్ట‌మే. సో... చ‌ర‌ణ్ కార‌ణంతోనే కాజ‌ల్‌కి ఈ సినిమాలో న‌టించే ఛాన్స్ ద‌క్కింద‌న్న‌మాట‌. మ‌రి కాజ‌ల్ అంటే చ‌ర‌ణ్ కి ఎంతుకింత ఇదో మ‌రి..??

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com