Home

»

Latest News

అది ఔట్ డేటెడ్ బాడీ!

Aug 4, 2016 12:55PM

ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ ల తర్వాత మరో నందమూరి హీరో తారకరత్న కూడా సిక్స్ ప్యాక్ చేశాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన "కాకతీయుడు" అనే సినిమాలో తారకరత్న సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడని సదరు సినిమా దర్శకనిర్మాతలు పబ్లిసిటీ చేసుకొంటున్నారు. అయితే.. "కాకతీయుడు" అనేది ఏమీ కొత్త సినిమా కాదు ఎప్పుడో ఏడాది క్రితమే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయ్యి మొన్నటివరకూ ల్యాబ్ లో పడి ఉన్న ఈ సినిమా రీల్ కి పట్టిన దుమ్ము దులిపి ఇప్పుడు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. 

కానీ ఇదేదో కొత్త సినిమా అన్నట్లు పబ్లిసిటీ చేసుకొంటున్నారు నిర్మాతలు. ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాస్తో కూస్తో గుర్తింపు తెచ్చుకొంటున్న తారకరత్నకు ఈ సినిమా ఏ విధంగానూ ఉపయోగపడదు. పైగా హీరోయిన్ మొదలుకొని విలన్ వరకూ ఎవరూ చెప్పుకోదగ్గవాళ్లు లేకపోవడంతో సినిమా చూడడానికి థియేటర్ల వరకూ కూడా జనాలు రావడం కష్టమే. మరి దర్శకనిర్మాతలు ఏం ప్లాన్ చేసుకొన్నారో తెలియదు కానీ.. "కాకతీయుడు" సినిమాను సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com