Home

»

Latest News

Ram Charan: చరణ్ కి గాయాలు! 

Mar 25, 2026

 


-గాయాలు పాలయిన రామ్ చరణ్!
ఈ వార్తలో నిజమెంత!
మరి పెద్ది పోస్ట్ పోన్ అవుతుందా!


'రై రారా' అంటు మెగాపవర్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)యూట్యూబ్ ని షేక్ చేస్తుండటంతో నీ కోసమే ఎదురుచూస్తున్నాం పెద్ది, కానీ ఈ సారి ఏప్రిల్ 30 న వస్తున్నాననే మాట తప్పితే బాగోదని అభిమానులు, మూవీ లవర్స్ పోటాపోటీగా 'పెద్ది' టీంకి మెసేజ్ లు చేస్తున్నారు. ఇప్పుడు ఆ అభిమానులు షాక్ కి గురయ్యే సంఘటన జరిగింది. ఎక్స్ క్లూజివ్ గా మీ కోసం అందిస్తున్నాం

గత కొన్ని రోజుల నుంచి పెద్ది(Peddi)షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ షూటింగ్ లో చరణ్ గాయాలుపాలయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక యాక్షన్ ఎపిసోడ్ చేస్తుంటే కంటి దగ్గర గాయమైందని, కాకపోతే చిన్న దెబ్బే అని సమాచారం. అయితే చిత్ర బృందం నుంచి మాత్రం గాయం విషయంపై అధికార ప్రకటన రాలేదు. కొన్ని రోజులు షూటింగ్ వాయిదాపడనుందనే సమాచారం కూడా సినీ సర్కిల్స్ లో ఇష్టారీతిలో చక్కర్లు కొడుతుంది.

also read: Mega Youth Force: మెగా యూత్ ఫోర్స్ జాతీయ కన్వీనర్ ఎంపిక.. ఎవరో తెలిస్తే కంగ్రాట్స్ చెప్తారు

ఇక చరణ్ బర్త్ డే ఈ నెల 27 న కావడంతో సోషల్ మీడియాలో చరణ్ అండ్ మెగా ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ అయింది. తమ అభిమాన హీరోకి బర్త్ డే విషెస్ చెప్తూ వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల గురించి వెల్లడి చేస్తున్నారు. బర్త్ డే రోజు 'పెద్ది' నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. ఇంకో టీజర్ తో పాటు సాంగ్ రిలీజ్ అవ్వచ్చనే టాక్ అయితే బలంగానే వినిపిస్తుంది. పెద్ది టీం గురించి అందరికి తెలిసిందే. కొత్తగా మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)ఒక సాంగ్ లో జాయిన్ కానుందనేది ఫ్రెష్ న్యూస్.



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com