Home

»

Latest News

Mardaani 3: 93 మంది అమ్మాయిల కిడ్నాప్ మిస్టరీ.. ఓటీటీలోకి రాణి ముఖర్జీ పవర్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్!

Mar 25, 2026

  • రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్
  • బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన క్రైమ్ థ్రిల్లర్
  • నెట్‌ఫ్లిక్స్‌లో శివాని శివాజీ రాయ్ వేట షురూ

బాలీవుడ్ యాక్షన్ క్వీన్ రాణి ముఖర్జీ(Rani Mukerji) సిల్వర్ స్క్రీన్ పై మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివాని శివాజీ రాయ్ పాత్రలో ఆమె నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'మర్దానీ 3'. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. (Mardaani 3)

కిడ్నాప్ మిస్టరీ
'మర్దానీ 3' కథాంశం అత్యంత సున్నితమైన, భయంకరమైన సామాజిక సమస్య చుట్టూ తిరుగుతుంది. మూడు నెలల వ్యవధిలోనే దాదాపు 93 మంది బాలికలు అదృశ్యం కావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ఈ కేసును ఛేదించే బాధ్యతను శివాని శివాజీ రాయ్ (రాణి ముఖర్జీ) తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు తారసపడే బిచ్చగాళ్ల మాఫియా, మెడికల్ ఎక్స్‌పెరిమెంట్స్ వెనుక ఉన్న అసలు నిజాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 

స్ట్రీమింగ్ అప్డేట్
యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 30న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణంగా పెద్ద సినిమాలు ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. అదే సంప్రదాయాన్ని పాటిస్తూ, 'మర్దానీ 3' ఈ నెల మార్చి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో మిస్ అయిన క్రైమ్ థ్రిల్లర్ ప్రియులకు ఇది మంచి అవకాశమని చెప్పాలి.

ఫ్రాంచైజీలో ఫస్ట్ లేడీ విలన్
మర్దానీ సిరీస్‌లో గత రెండు భాగాల్లో మేల్ విలన్లే ఉండగా, ఈ మూడో పార్ట్‌లో మొదటిసారిగా ఒక లేడీ విలన్‌ను పరిచయం చేశారు. 'అమ్మ' అనే పాత్రలో మల్లికా ప్రసాద్ తన నటనతో వణుకు పుట్టించింది. రాణి ముఖర్జీకి ధీటుగా ఆమె పోషించిన ఈ క్రూరమైన పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలిచింది. అలాగే జానకి బోడివాలా, జిషూ సేన్‌గుప్తా వంటి నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 

సుమారు 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 75 కోట్లపైగా వసూళ్లను సాధించింది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, బలమైన ఎమోషన్స్ ఉండటంతో ఓటీటీలో కూడా ఈ మూవీ రికార్డులు సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రాణి ముఖర్జీ కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలిచిపోవడమే కాకుండా, సామాజిక బాధ్యతను గుర్తుచేసే చిత్రంగా నిలిచింది. మార్చి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com