.webp)
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తన వన్ మాన్ షో పెద్ది(Peddi)తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. నాలుగురోజులకి 292 .5 కోట్ల గ్రాస్ సాధించాడంటే పెద్దిగా ఏ స్థాయిలో పెర్ఫార్మ్ చేసాడో అర్ధం చేసుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే చరణ్ ప్రదర్శించిన పెర్ఫార్మ్ కి ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కి కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు.
కానీ చరణ్ పెద్దిలోని క్లైమాక్స్ ఎపిసోడ్ చూసి థియేటర్ సీట్లోనే కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ స్క్రీనింగ్‌లో చరణ్ తన కుటుంబంతో కలిసి పెద్దిని వీక్షించారు. సినిమా ముగిసే సమయానికి క్లైమాక్స్ లోని ఎమోషనల్ సన్నివేశాలని చూసి చరణ్ తన భావోద్వేగాలని నియంత్రించుకోలేకపోయాడు. చరణ్ కళ్ల వెంబడి నీళ్లు తిరుగుతుండగా, పక్కనే ఉన్న దర్శకుడు బుచ్చిబాబు ఆ క్షణాలని తన కెమెరాలో బంధించాడు. ఆడియన్స్ ఇచ్చే పీక్ రియాక్షన్స్ తో పాటు స్వయంగా హీరోనే అంతలా లీనమైపోవడాన్ని చూసి చిత్ర యూనిట్ ఎంతో గర్వపడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అభిమానులు ఈ వీడియో చూసి భావోద్వేగానికి గురవుతున్నారు.
Also read: Varun Tej: కొరియన్ కనకరాజు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!
చరణ్ 'పెద్ది' అనే ఒక సామాన్య గ్రామ యువకుడి పాత్రలో ప్రాణం పెట్టి నటించారు. ప్రభుత్వ రికార్డుల్లో కనీసం పేరు కూడా లేని, సమాజంలో ఉన్నా లేనట్టు బతుకుతున్న ఒక చిన్న ఊరి గుర్తింపు కోసం పోరాడే యువకుడిగా కనిపించాడు. క్రికెట్, కుస్తీ, అథ్లెటిక్ వంటి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ గౌర్ యుడు' అనే క్యారక్టర్ లో చరణ్ కి గురువుగా చేసాడు. ఆస్కార్ విజేత ఎ.ఆర్. రహ్మాన్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్దిని మరో లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు.




.webp)
