Home

»

Latest News

Thaman: నేను షో చేస్తే అది చారిటీ కోసమే.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంచలన వ్యాఖ్యలు!

Jun 8, 2026 2:27PM

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ (SS Thaman) కేవలం వెండితెరపైనే కాకుండా లైవ్ కాన్సర్ట్ లు, మ్యూజికల్ షోలతోనూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో తన అప్ కమింగ్ మ్యూజికల్ కాన్సెప్ట్‌ 'ఓజీ టూర్'కు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఈ షో వెనుక ఉన్న అసలు మోటివ్ ఏంటనేది తమన్ వెల్లడించారు.

ప్రెస్ మీట్ ఇంటరాక్షన్‌లో భాగంగా ఒక జర్నలిస్ట్ తమన్‌ను ప్రశ్నిస్తూ.. "ఈ మ్యూజిక్ కాన్సర్ట్ వెనుక ఉన్న ప్రధాన మోటివ్ ఏంటి? ఇది కమర్షియల్ యాంగిలా లేక చారిటీ కోసమా?" అని అడిగారు. దీనికి తమన్ ఏమాత్రం తడుముకోకుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా సమాధానమిచ్చారు. "నేను ఒక షో చేస్తున్నాను అంటే అది కచ్చితంగా చారిటీ కోసమే ఉంటుంది. నా సొంత లాభం కోసం, నా కోసం నేను ఎప్పుడూ ఇలాంటి మ్యూజికల్ షోలు చేసుకోను" అని స్పష్టం చేశారు. తమన్ నోట వచ్చిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

అంతేకాదు, ఈ కాన్సర్ట్ ద్వారా వచ్చే మొత్తం రెవెన్యూ పూర్తిగా సేవా కార్యక్రమాలకే వెళ్తుందని ఆయన చెప్పారు. ఈ షో ద్వారా ఎంత మొత్తం కలెక్ట్ అయింది, దాన్ని ఎక్కడెక్కడ చారిటీకి ఉపయోగించామనే పూర్తి వివరాలను కూడా తానే స్వయంగా పబ్లిక్‌కు అనౌన్స్ చేస్తానని తమన్ వెల్లడించారు. షో కంప్లీట్ అయిన వారం రోజుల్లోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ప్రతి ఒక్క పైసా లెక్కను అధికారికంగా బయటపెడతానని జర్నలిస్టుల సాక్షిగా తమన్ ప్రామిస్ చేశారు.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమాజం పట్ల బాధ్యతతో తమన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ అభిమానులు ఎంతగానో అభినందిస్తున్నారు. కేవలం కమర్షియల్ లబ్ది కోసమే కాకుండా ఇలాంటి సేవా దృక్పథంతో మ్యూజికల్ ఈవెంట్స్ ప్లాన్ చేయడం గర్వించదగ్గ విషయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com