
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) మరికొద్ది గంటల్లో థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు ఈ సినిమా చూసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒక విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అదే సినిమాలో వచ్చే పవర్‌ఫుల్ హాస్పిటల్ సీన్.
డైరెక్టర్ బుచ్చిబాబు మార్క్ ఎమోషన్, రామ్ చరణ్ నటన పీక్స్‌కి వెళ్లిన సందర్భం ఇది అని అంటున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇదొక బెస్ట్ పవర్‌ఫుల్ సీన్‌గా నిలిచిపోతుందని కొనియాడుతున్నారు. సినిమాలో అద్భుతమైన ఎపిసోడ్స్ ఎన్ని ఉన్నప్పటికీ, ఈ హాస్పిటల్ బ్లాక్ మాత్రం ఆడియన్స్ గుండెలను పిండేయడం ఖాయమని టాక్.
దాదాపు 5 నిమిషాల పాటు సాగే ఈ హాస్పిటల్ బ్లాక్ మొత్తం సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. ఈ ఎపిసోడ్ లో చరణ్ నటన చాలాకాలం గుర్తుండిపోతుందని చెప్పుకుంటున్నారు. ఒక నటుడిగా చరణ్ ఎంతగా ఎదిగారో చెప్పడానికి ఈ ఒక్క సీన్ చాలు అని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో భారీ యాక్షన్ సీక్వెన్సులు, కలర్‌ఫుల్ సాంగ్స్ ఆడియన్స్‌ను ఊపేస్తుంటాయి. కానీ 'పెద్ది' సినిమా విషయంలో మాత్రం ఈ ఎమోషనల్ హాస్పిటల్ సీన్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు.
మరి 'పెద్ది' మూవీలో ఈ హాస్పిటల్ సీన్ ఎలా ఉండబోతుంది అనేది మరికొద్ది గంటల్లో తెలియనుంది.





.webp)
