.webp)
స్టార్ హీరో సూర్య(Suriya)కి ప్లాప్స్ నుంచి విముక్తి కల్పించిన చిత్రం కరుప్పు(Karuppu)అలియాస్ వీరభద్రుడు.మైథలాజికల్ ఫాంటసీ కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటని కొనసాగిస్తోంది.
మొదటి వారం 113.85 కోట్ల రూపాయల భారీ నెట్ కలెక్షన్లని సాధించి సూర్య బాక్సాఫీస్ స్టామినాను నిరూపించింది. రెండో వారంలో కూడా అదే జోరును కొనసాగిస్తూ మరో 54.30 కోట్ల రూపాయలని తన ఖాతాలో వేసుకుంది. అంటే కేవలం 12 రోజులు గడిచేసరికి ప్రపంచవ్యాప్తంగా 253.26 కోట్ల రూపాయల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇందులో ఇండియా గ్రాస్ వసూళ్లు 184.26 కోట్ల రూపాయలుగా ఉండగా, ఓవర్సీస్ మార్కెట్ నుండి 69 కోట్ల రూపాయల భారీ వసూళ్లు వచ్చాయి.
అంతటితో కరుప్పు ప్రభంజనం ఆగలేదు.16వ రోజు 5.15 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించడంతో, ఇండియాలో మొత్తం 204.21 కోట్ల రూపాయల గ్రాస్ కి చేరుకున్నాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా స్థిరమైన రన్ కొనసాగిస్తూ 77.75 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ క్రమంలోనే 16 రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు 281.96 కోట్ల రూపాయల మార్కును తాకాయి. ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా 20 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వరల్డ్‌వైడ్‌గా ఏకంగా 300 కోట్ల రూపాయల క్లబ్‌లో అడుగుపెట్టి సూర్య కెరీర్‌లోనే ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది.
Also read: Ranveersingh: డాన్ 3 వివాదం... రణవీర్ సింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
ఏరియాల వారీగా చూస్తే తమిళనాడులో అత్యధికంగా 140 కోట్ల రూపాయల వసూళ్లు నమోదవగా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 32.50 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించింది. కర్ణాటకలో 21.25 కోట్లు, కేరళలో 13.50 కోట్ల రూపాయలతో సౌత్ ఇండియా అంతటా ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కాకపోతే ఈ సాయంత్రం నుంచి ప్రీమియర్స్ తో పెద్ది వరల్డ్ వైడ్ గా అడుగుపెడుతుండటంతో కరుప్పు కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.






