రజనీకాంత్ మరోమారు కాపీ కొడుతున్నాడు...!
on Jun 29, 2016
తమిళనాట మరీ సూపర్ స్టార్ రజనీ రేంజ్ లో కాకపోయినా.. ఇంచుమించిగా అదే స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ తోపాటు స్టార్ డమ్ కలిగిన కథానాయకుడు అజిత్. ఈ మధ్యకాలంలో హ్యాట్రిక్ హిట్ కొట్టి మాంచి జోరుమీడున్నాడు. అందుకే రాజనీకాంత్ కూడా అజిత్ స్టైల్ ను ఫాలో అయిపోతున్నాడు. అసలు సౌత్ సినిమాకు "సాల్ట్ అండ్ పెప్పర్ లుక్" (సగం నెరిసిన తల, గెడ్డం) పరిచయం చేసిందే అజిత్. ఆ తర్వాత తాను నటించిన అన్నీ సినిమాల్లోనూ అదే లుక్ తో అలరించాడు. "కబాలి" సినిమాలో రజనీ కూడా అజిత్ పరిచయం చేసిన "సాల్ట్ అండ్ పెప్పర్ లుక్"లోనే సూపర్ స్టైలిష్ గా దర్శనమిస్తున్నాడు. ఇప్పుడు అదే ధోరణిలో అజిత్ ను మరోమారు కాపీ కొడుతున్నాడు రజనీకాంత్. "వేదాలమ్" సినిమా టైమ్ లో అజిత్ సినిమాకి సంబంధింకిన టీజర్ మినహా ఏ ఇతర కంటెంట్ ను విడుదల చేయలేదు. ఆఖరికి సాంగ్ ప్రోమోస్ కూడా రిలీజ్ చేయలేదు. టీవీల్లో యాడ్స్ ఇవ్వలేదు.
డిస్ట్రిబ్యూటర్లు సినిమా చూడకుండానే కొనేశారు, సినిమా సూపర్ హిట్ అయిపోయింది. అప్పటికి చెన్నై వరద భీభత్సం కారణంగా థియేటర్లు మూసివేయబడడంతో "వేదాలమ్" కలెక్షన్ల సునామీ కంట్రోల్ అయ్యింది గానీ లేకుంటే సునాయాసంగా వంద కోట్లు కలెక్ట్ చేసేసేది. ఇప్పుడు "వేదాలమ్" ప్రమోషన్ టెక్నిక్ నే తన సినిమా కోసం వాడేస్తున్నాడు రజనీకాంత్. అందుకే తన తాజా చిత్రం "కబాలి" సినిమాకి సంబంధించిన టీజర్ ను మినహా ట్రైలర్ ను కూడా విడుదల చేయలేదు. సాంగ్ ప్రోమోస్ లో కూడా ఇంట్రో సాంగ్ ఒక్కటే బయటకు వచ్చింది. మరి అజిత్ ను ఫాలో అవుతున్న రజనీకి విజయం దక్కుతుందో లేదో చూడాలి!