Home

»

Latest News

మారాం చేస్తున్న మహేష్ బాబు..!

Jun 29, 2016 10:37AM

దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు హాట్ ప్రాపర్టీ అయిపోయాడు. అతగాడితో ఒక సినిమా చేసిన ప్రతి కథానాయకుడూ మళ్ళీ అతనే కావాలని మారాం చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీయార్ హీరోగా "జనతా గ్యారేజ్" చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కొరటాల శివ.. అనంతరం డివివి దానయ్యతో మరో సినిమా ఒకే చేశాడు. ఆ సినిమాలో హీరోగా చరణ్ నటించనున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రముఖ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని నిర్మాతగా మారుతూ రూపొందించనున్న సినిమాకు కొరటాల దర్శకత్వం వహించనున్నడు, "జనతా గ్యారేజ్" టైమ్ లో కొరటాల పనితనం చూసి ముగ్ధుడైన ఎన్టీయార్ ఈ తాజా చిత్రంలో హీరోగా నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడని సమాచారం.

ఇప్పుడు మహేష్ బాబు కూడా "నాకు కొరటాలే కావాలి" అంటున్నాడట. తనకు కథానాయకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ "శ్రీమంతుడు" చిత్రంతో తిరుగులేని స్టార్ డమ్ ను తెచ్చిపెట్టిన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు మహేష్ ఉవ్విళ్లూరుతున్నాడట. ఎంత తొందరగా కుదిరితే అంత త్వరగా కొరటాల డైరెక్షన్ లో ఇంకో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నాట్ట మహేష్ బాబు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com