Home

»

Latest News

నిలిచిపోయిన రోబో-2 షూటింగ్

Nov 4, 2016 10:42AM

సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న రోబో 2.0 షూటింగ్ జెట్ స్పీడుతో దూసుకెళుతోంది. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రజంట్ యూఎస్‌లో ఆఖరి షెడ్యూల్‌లో ఉంది. అయితే ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో కొన్ని సీన్స్‌ను శంకర్ తన ఫేవరేట్ స్టైల్‌ ఫ్రీజ్ టెక్నిక్‌తో తెరకెక్కించాలని నిర్ణయించారట..అయితే అందుకోసం ఏర్పాటు చేసిన స్పెషల్ కెమెరాలలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయట..దీంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు కోలీవుడ్ టాక్. దీంతో రజనీకాంత్, అమీజాక్సన్, మోడల్ సుధాన్షు పాండేలపై తీయాల్సిన సీన్లు ఆగిపోయాయట. అయితే వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి తిరిగి షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు శంకర్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com