
సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్.. ఈ ఇద్దరినీ ఒకే తెరపై చూడాలని అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ దిగ్గజ నటీనటుల కలయికలో సినిమా రాబోతోందనే ప్రకటన రావడంతో సినీ ప్రపంచంలో భారీ ఆసక్తి నెలకొంది. ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘KH×RK’ ప్రోమో కూడా అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. కానీ ఇప్పుడు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
మొదట ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ భారీ స్థాయిలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే తమిళనాడులో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణ సంస్థ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పూర్తిగా టేకోవర్ చేస్తుందనే వార్తలు కూడా వినిపించాయి.
అయితే బడ్జెట్ పరిమితులు, ఇద్దరు దిగ్గజ నటీనటుల కాల్షీట్ల సర్దుబాటు వంటి సమస్యల కారణంగా ప్రస్తుతానికి సినిమాను పక్కన పెట్టినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. భవిష్యత్తులో కూడా ఈ సినిమా పట్టాలెక్కడం కష్టమేననే ప్రచారం మొదలైంది.

రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’తో పాటు ‘ధర్మన్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ధర్మన్’కు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తుండగా, కమల్ హాసన్ నిర్మాత కావడం విశేషం. ఈ సినిమా పూర్తయిన తర్వాత నెల్సన్ దర్శకత్వంలో కమల్ హాసన్‌తో కలిసి రజనీకాంత్ నటించే సినిమా ప్రారంభమవుతుందని అభిమానులు భావించారు.
కానీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమైతే.. ఈ కాంబినేషన్‌ను తెరకెక్కించేందుకు మరో నిర్మాణ సంస్థ ముందుకొస్తుందా అనే ప్రశ్న కూడా అభిమానుల్లో మొదలైంది. కమల్ హాసన్, రజనీకాంత్‌లాంటి దిగ్గజాలు కలిసి నటిస్తే అది తమిళ చిత్ర పరిశ్రమకే కాకుండా దేశవ్యాప్తంగా సినీ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అందుకే ఈ సినిమా ఆగిపోకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: ఫౌజీ రీషూట్.. అవుట్‌పుట్ నచ్చలేదా?.. తెరవెనుక ఏం జరుగుతోంది.?
[KHxRK Shelved Or Not, Rajinikanth Kamal Haasan Movie, Rajinikanth, Kamal Haasan, Nelson Dilipkumar, KHxRK, Red Giant Movies, Raaj Kamal Films International, Telugu Film News]






