Home

»

Latest News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై రాహుల్ రామకృష్ణ విమర్శలు.. నా లెక్కలకి సమాధానం ఇస్తారా!

Jun 8, 2026 2:26PM

 

-పవన్ కళ్యాణ్ పై రాహుల్ రామకృష్ణ సంచలన ట్వీట్ 
-ఆర్భాటాలు పక్కన పెడతారా!
-మీ ఫ్యాన్ గా అడుగుతున్నానంటూనే చురకలు 

టాలీవుడ్ యాక్టర్ 'అర్జున్ రెడ్డి' ఫేమ్ రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని ట్వీట్లు ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. సమాజంలో జరిగే విభిన్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ముక్కుసూటిగా స్పందించే రాహుల్ రామకృష్ణ, తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని లక్ష్యంగా చేసుకుని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వరుస ప్రశ్నాస్త్రాలు సంధించారు. 

తన ట్వీట్‌లో 'పవన్ కళ్యాణ్ గారు, మీ ఆర్భాటాలు, గొప్పలు కాసేపు పక్కన పెడితే సమాచార హక్కు చట్టం RTI యాక్ట్ కింద మీరు నిర్వహించే ప్రతి శాఖలోని అన్ని విభాగాల్లో సమాచారాన్ని ప్రజలకు వెల్లడిస్తున్నారా? ముందస్తు సమాచార బహిర్గతానికి సంబంధించిన సెక్షన్ 4.1(బి)  ని మీ శాఖల్లో పూర్తిస్థాయిలో అమలు చేశారా సార్? నేను మీ అభిమానిగా మాత్రమే ఈ ప్రశ్న అడుగుతున్నాను.ప్రజాప్రతినిధులుగా మీరు మా ప్రశ్నలకు నిరంతరం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రశ్నించినంత మాత్రాన నన్ను తప్పుగా భావించవద్దు. ప్రశ్నలు అడిగినంత మాత్రాన నేనేమీ దేశద్రోహిని కాను అంటూ ట్వీట్ చేసాడు.


Also read: Peddi: ఏడ్చేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్

అంతటితో ఆగకుండా గిరిజన ప్రాంతాల్లో చట్టాల అమలు, పర్యావరణ అంశాలపై కూడా రాహుల్ తీవ్రమైన ప్రశ్నలు గుప్పించారు. గిరిజన హక్కులకు సంబంధించిన పెసా చట్టం, 1/70 చట్టం, అలాగే గ్రామసభ చట్టం అమలుకి  సంబంధించిన గ్రౌండ్ లెవెల్ ఫలితాలని  దయచేసి ప్రజలకి తెలియచేయాలి. ఏపీ ప్రభుత్వం లేదా పవన్ కళ్యాణ్ శాఖ ఆధ్వర్యంలో చేసినట్లు చెబుతున్న అటవీకరణ కార్యక్రమాల వివరాలని కూడా బహిర్గతం చేయాలి. ఒక స్వతంత్ర సంస్థ ధృవీకరించిన లెక్కల ప్రకారం చూస్తే ఆ గణాంకాలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను స్వయంగా ఆర్టీఐ ద్వారా దాఖలు చేసి, గుర్తించిన ఫలితాల ఆధారంగానే ఈ వివరాలను అడుగుతున్నానని చెప్పిన రామకృష్ణ  తన ట్వీట్ ముగింపులో 'జై తెలంగాణ' అని నినదించడం విశేషం.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com