Home

»

Latest News

‘వాస్కోడిగామా’గా పూరి త‌న‌యుడు!!

Nov 27, 2018 10:26AM

పూరి త‌న‌యుడుతో `మెహ‌బూబా` చిత్రం చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా ఆశించినంత‌గా ఆడ‌లేదు.  ఆకాష్ తో పూరి మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు. అయితే ద‌ర్శ‌కుడుగా కాదు నిర్మాతగా. క‌థ కూడా పూరినే అందిస్తున్నాడు. ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు మాత్రం త‌న శిష్యుల్లో ఒక‌రైన అనిల్ ప‌డూరికి అప్ప‌జెబుతున్నాడ‌ట‌.  ఈ సినిమాకు `వాస్కోడిగామా` అనే టైటిల్ ని క‌న్ ఫ‌ర్మ్ చేసార‌ట‌. ఇప్ప‌టికే ఈ టైటిల్ ఫిలించాంబ‌ర్ లో కూడా రిజిస్ట‌ర్ చేసినట్లు తెలుస్తోంది.
                         
గ‌తంలో  పూరి త‌మ్ముడు సాయి రామ్ శంక‌ర్ కి వ‌రుస‌గా ఫ్లాపులు ప‌డుతుంటే  క‌థ అందించాడు పూరి. అదే `బంప‌ర్ ఆఫ‌ర్‌` ఆ సినిమా మంచి స‌క్సెస్ గా నిలిచింది.  ఇప్ప‌డు అదే విధంగా త‌న‌యుడి విష‌యంలో రిపీట్ అవుతుంద‌న్న ఆశాభావంతో ఉన్నాడ‌ట పూరి జ‌గ‌న్నాథ్‌.  ఈ సినిమా ద్వారా గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్ అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా ప‌రిచ‌యం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.  ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ కి కూడా పెద్దగా ఆఫ‌ర్స్ ఏమీ లేదు.  మ‌రి ఇలాంటి టైమ్ త‌న‌యుడు ఆకాష్ కి కూడా ఈ సినిమా చాలా కీల‌క‌మే అని చెప్పాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com