Home

»

Latest News

పునీత్ రాజ్‌కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ టీజ‌ర్ వ‌చ్చింది!

Dec 7, 2021 3:52PM

 

క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న ప్రాజెక్ట్‌ 'గంధ‌ద‌ గుడి' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. పునీత్ త‌ల్లి పార్వ‌త‌మ్మ జ‌యంతి సంద‌ర్భంగా సోమ‌వారం (డిసెంబ‌ర్ 6) ఈ సినిమా టీజ‌ర్‌ను మేక‌ర్స్ ఆవిష్క‌రించారు. దివంగ‌త పునీత్ సాహ‌సోపేత ప్ర‌యాణాన్ని ఈ ఫిల్మ్ చూపిస్తుంది. ఇది.. పునీత్ రాజ్‌కుమార్‌, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్ అండ్ ఫిల్మ్‌మేక‌ర్ అమోఘ‌వ‌ర్ష కాంబినేష‌న్‌లో త‌యారైన ఫిల్మ్‌.

దాదాపు ఒక‌టిన్న‌ర నిమిషాల నిడివి వున్న ఈ టీజ‌ర్‌లో అమోఘ‌వ‌ర్ష‌తో క‌లిసి పునీత్ అడ‌వుల‌ను శోధించ‌డంతో పాటు, వ‌న్య‌ప్రాణుల అద్భుత‌మైన విజువ‌ల్స్ ఉన్నాయి. వ‌చ్చే ఏడాది 'గంధ‌ద గుడి' థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతుంద‌ని ఈ టీజ‌ర్‌లో తెలిపారు. యూట్యూబ్‌లో "అప్పు క‌ల‌, ఒక అద్భుత‌మైన ప్ర‌యాణం, మ‌న భూమి, దాని గొప్ప‌త‌నానికి సంబంధించిన సెల‌బ్రేష‌న్‌, ఇది తిరిగివ‌చ్చే స‌మ‌యం - పూర్తి నిడివి చిత్రంలో గంధ‌ద గుడి" అని డిస్క్రిప్ష‌న్‌లో రాసుకొచ్చారు. పునీత్ భార్య అశ్వినీ పునీత్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా త‌యారైన ఈ ఫిల్మ్‌కు అజ‌నీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఇచ్చాడు.

Also read:  రీల్ స్టార్ టు రియ‌ల్ స్టార్‌.. పునీత్‌ రాజ్‌కుమార్ లైఫ్ స్టోరీ!

అక్టోబ‌ర్‌లో పునీత్ చేసిన ఒక ట్వీట్ ఈ ప్రాజెక్ట్‌పై అంచ‌నాల‌కు తెర‌లేపింది. "ద‌శాబ్దాల క్రితం ఒక క‌థ పుట్టింది. మ‌న ప్ర‌జ‌లు, మ‌న భూమి గొప్ప‌త‌నం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న మూలాలు విస్త‌రించి ఉన్నాయి. త‌ర‌త‌రాల‌కు అదిచ్చే స్ఫూర్తి అనిర్వ‌చ‌నీయం. ఆ చ‌రిత్ర‌ను చెప్పాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది." అని అప్పుడు ట్వీట్ చేశారు పునీత్‌. 'గంధ‌ద గుడి' అనేది పునీత్ తండ్రి లెజెండ‌రీ యాక్ట‌ర్ డాక్ట‌ర్ రాజ్‌కుమార్ న‌టించిన ఒక పాపుల‌ర్ ఫిల్మ్ టైటిల్ కూడా.

Also read:  విధి క్రూరంగా విడ‌దీసిన అంద‌మైన ప్రేమ‌జంట పునీత్-అశ్విని!

అక్టోబ‌ర్ 29న 46 సంవ‌త్స‌రాల వ‌య‌సులో తీవ్ర గుండెపోటుతో ఆక‌స్మికంగా క‌న్నుమూశారు పునీత్ రాజ్‌కుమార్‌. ఆయ‌న‌కు భార్య అశ్విని, ఇద్ద‌రు కుమార్తెలున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com