Home

»

Latest News

నిర్మాత vs ప్రేక్షకుడు.. హాయిగా హుషారుగా షికారు పోదమా

Aug 14, 2026 5:43PM

 


చాలా మంది సినీ ప్రేమికులు చాలా సంవత్సరాల నుంచి సరైన సినిమాలు రావడం లేదని, ఫెయిల్యూర్స్ ఎక్కువ అయ్యాయని భాధపడుతుంటారు. అదే  అగ్ర హీరో సినిమా ఫెయిల్ అయితే అభిమానులతో పాటు సినీ ప్రేమికులు సైతం కన్నీటి పర్యంతం అవుతారు. పాపం నిర్మాత అని జాలి కూడా చూపిస్తారు.ఈ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే సినిమాకి ఉన్న ట్రాక్ రికార్డు చెక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్లందరికీ తెలియాల్సిన విషయం ఒకటుంది. 

తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరోల సినిమాలు విడుదల కాకముందే భారీ విజయాన్ని సాధిస్తున్నాయనేది సినీ వ్యాపారంలో ఒక ఆసక్తికరమైన నిజం. బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా సాధించే టాక్ లేదా ఫలితంతో సంబంధం లేకుండా, నిర్మాతలు ముందే తమ మొత్తం పెట్టుబడిలో దాదాపు 60% నుండి 80% వరకు డిజిటల్ (OTT), శాటిలైట్,మ్యూజిక్, నాన్  దియేట్రికల్ హక్కుల ద్వారా వెనక్కి రాబట్టుకుంటున్నారు. గతంలో కేవలం థియేటర్ టికెట్ల వసూళ్లపైనే ఆధారపడిన టాలీవుడ్ పరిశ్రమ, నేడు 100 కోట్ల నుండి  300 కోట్ల దాకా జరిగే డిజిటల్ మరియు బిజినెస్ డీల్స్ పైనే ప్రధానంగా రన్ అవుతోంది.

 డిజిటల్ వేదికలైన నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఒక్కో బిగ్ స్టార్ సినిమా డిజిటల్ హక్కుల కోసం  50 కోట్ల నుండి  150 కోట్ల భారీ మొత్తం చెల్లిస్తుండటంతో, నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్‌కి ముందే సేఫ్ జోన్‌లోకి అడుగుపెడుతున్నారు.  అంతేకాదు, సినిమా థియేటర్లలోకి వచ్చిన మొదటి రెండు రోజుల్లోనే ఫ్యాన్స్ హంగామా, స్టార్ హీరోల ఊరమాస్ క్రేజ్ వల్ల దాదాపు 50% నుండి 70% వరకు థియేట్రికల్ రికవరీ జరిగిపోతుంది. ఒకవేళ సాధారణ ప్రేక్షకులకి, మూవీ లవర్స్ కి  సినిమా నచ్చకపోయినా, రివ్యూలు ప్రతికూలంగా వచ్చినా, తొలి 3 రోజుల ఓపెనింగ్స్ మరియు ప్రి రిలీజ్ డిజిటల్ డీల్స్ కాంబినేషన్ వల్ల నిర్మాతలు నష్టాల బారిన పడకుండా బయటపడుతున్నారు. ఇది కేవలం పాన్-ఇండియా స్టార్లకే కాదు, 10 కోట్ల నుండి రూ. 15 కోట్ల బడ్జెట్ ఉన్న మీడియం సినిమాలకు కూడా రూ. 8 కోట్ల వరకు నాన్-థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోతూ నిర్మాతలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఈ వ్యాపార సూత్రం వల్ల టాలీవుడ్ లో సినిమా నిర్మాణంలో ఉండే ఆర్థిక రిస్క్ శాతం గణనీయంగా తగ్గింది.  అయితే, ఈ ఓటీటీ వ్యవస్థలో కొన్ని సరికొత్త సవాళ్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల డిజిటల్ సంస్థలు తమ కండిషన్లను కఠినతరం చేస్తూ, సాధారణ సినిమాల OTT ధరల్లో 20% నుండి 30% వరకు కోతలు విధిస్తున్నాయి. థియేటర్లలో సినిమా సాధించే వసూళ్లను బట్టి చివరి ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించే కొత్త నిబంధనలను తీసుకొస్తున్నాయి. అయినప్పటికీ ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి గ్లోబల్ రీచ్ ఉన్న టాప్ స్టార్స్ విషయంలో మాత్రం డిజిటల్ డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. 

also read: అగధ హైలెట్స్ ఇవే  

ప్రతి ఏటా దాదాపు 180కి పైగా చిత్రాలు టాలీవుడ్‌లో సెట్స్ పైకి వెళ్తుండగా, బిగ్ బడ్జెట్ చిత్రాలకు ఈ డిజిటల్ ఓటీటీ మార్కెట్ ఒక బలమైన రక్షణ కవచంలా మారింది.  అభిమానుల మొదటి రోజు థియేటర్ హడావుడి, ఓటీటీల ప్రీ-రిలీజ్ బిజినెస్ తోడవ్వడం వల్ల తెలుగు నిర్మాతలు నయా బిజినెస్ మోడల్‌తో దూసుకుపోతున్నారు. సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచినా, అసలు ఆడకపోయినా నిర్మాతలకి వచ్చే నష్టం లేదు. అందుకే సినిమా ప్లాప్ అయినా నిర్మాత' హాయిగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా, తీయ తీయగా అని పాడుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి మూవీ లవర్స్ కి చెప్పేది ఏంటంటే సినిమా పోయిందని  బాధ పడకుండా సోషల్ మీడియాలో సినిమా అసలు బాగోలేదు, రాడ్ అని చెప్పే వాళ్ళని చూసి నవ్వుకోండి. ఎందుకంటే అక్కడ ఉంది సినిమా.

Producer, Ott, TeluguCinema

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com